Anand Sharma: ఆ రెండు గ్రూపులతో కాంగ్రెస్ పుంజుకోదు: సీనియర్ లీడర్ ఆనంద్ శర్మ

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంపై ఆనంద్ శర్మను ప్రశ్నించగా ‘‘పార్టీకి ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రచారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా అనేది వేరే అంశం. కానీ నేనెప్పటికీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తినే. పార్టీ బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ముందు వరుసలో ఉంటాను’’ అని అన్నారు.

Anand Sharma: ఆ రెండు గ్రూపులతో కాంగ్రెస్ పుంజుకోదు: సీనియర్ లీడర్ ఆనంద్ శర్మ

Anand Sharma raises questions

Anand Sharma: పార్టీలోని అందరూ సమిష్టిగా పని చేస్తేనే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, ఏ గ్రూపు, బీ గ్రూపు వల్ల ప్రయోజనం ఉండదని ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. పార్టీలో గ్రూపు గొడవలు ఎక్కువగా ఉన్నాయని, ముందు వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ సూచనలు చేశారు.

‘‘పార్టీలో అంతర్గతంగా మార్పులు చేస్తేనే మార్పు వస్తుంది. ఏ గ్రూపు వల్లనో, బీ గ్రూపు వల్లనో పార్టీ పుంజుకోలేదు. పార్టీలోని అందరూ సమ్మిళితమై ముందుకు పోవాలి. ఆ పని జరిగినప్పుడే పార్టీ పుంజుకుంటుంది’’ అని అన్నారు. ఇక పార్టీ అధినేత ఎన్నిక గురించి స్పందిస్తూ ‘‘2018లో అందరం కలిసి రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. కానీ ఆయన ఏడాది తిరిగేలోపే రాజీనామా చేశారు. ఆయనను రాజీనామా చేయమని మేము అడగలేదు. నెహ్రూ-గాంధీ కుటుంబం సమగ్రంగా ఉండడం ముఖ్యం. అలాగే పార్టీకి సమ్మిళిత ఆలోచన విధానం అవసరం’’ అని అన్నారు.

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంపై ఆనంద్ శర్మను ప్రశ్నించగా ‘‘పార్టీకి ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రచారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా అనేది వేరే అంశం. కానీ నేనెప్పటికీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తినే. పార్టీ బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ముందు వరుసలో ఉంటాను’’ అని అన్నారు.

MLa Raja Singh : బీజేపీ నన్ను వదులుకోదు..నేను బీజేపీని వదులుకోను..సస్పెన్షన్ పై వివరణ ఇస్తా