JDU-BJP : ప్రధాని పదవిపై కన్నేసిన నితీష్..మోదీని “ఢీ” కొట్టేందుకు వ్యూహాలు!

ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగానే ఉంటూ కొంతకాలంగా విపక్షాలతో గొంతు కలుపుతూ బీజేపీకి తలనొప్పి పుట్టిస్తోంది జేడీయూ పార్టీ. కొద్ది రోజులుగా జేడీయూ అధినేత,బీహార్ సీఎం నితీష్ కుమార్

JDU-BJP : ప్రధాని పదవిపై కన్నేసిన నితీష్..మోదీని “ఢీ” కొట్టేందుకు వ్యూహాలు!

Modi Nitish

JDU-BJP ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగానే ఉంటూ కొంతకాలంగా విపక్షాలతో గొంతు కలుపుతూ బీజేపీకి తలనొప్పి పుట్టిస్తోంది జేడీయూ పార్టీ. కొద్ది రోజులుగా జేడీయూ అధినేత,బీహార్ సీఎం నితీష్ కుమార్..పలు అంశాల్లో మిత్రపక్షమైన బీజేపీనే ఇరుకున పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై విచారణ జరగాల్సిందేనని విపక్షాలతో గొంతుకలిపిన నితీష్ కుమార్..గత వారం రాజకీయ ప్రత్యార్ధి పార్టీ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో కలిసి కుల గణన విషయమై ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. ఇక తాము విభేదించే వివిధ అంశాలపై చర్చించడానికి రాష్ట్ర మరియు కేంద్రస్థాయిల్లో ఎన్డీయే కో ఆర్డినేషన్ కమిటీ ఉండాలని తాజాగా జేడీయూ చేస్తున్న డిమాండ్ బీజేపీకి తలనొప్పిగా మారింది.

అంతేకాకుండా,నితీష్ కుమార్ కి ప్రధానమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ ఆదివారం పట్నాలో నిర్వహించిన జేడీయూ జాతీయ కౌన్సిల్ సమావేశంలో తీర్మాణాన్ని కూడా పాస్ చేశారు. అయితే ఈ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన జేడీయూ ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ మరియు పార్టీ జాతీయ ప్రతినిధి కేసీ త్యాగి…వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో ఎన్డీయే కో ఆర్డినేషన్ కమిటీ ఉన్నట్లుగానే..ఇప్పుడు కూడా అలాంటి కమిటీ ఉండాలని మేం అనుకుంటున్నాం. దీనివల్ల తాము విభేదించే పలు అంశాలపై చర్చించవచ్చని తెలిపారు. ఇది కూటమి సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది మరియు NDA కూటమి నాయకుల నుండి అనవసరమైన వ్యాఖ్యలను ప్రోత్సహించదు. అయితే నితీష్ కుమార్ కి ప్రధాని అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయని,కానీ నితీష్ ప్రధానమంత్రి కాలేక పోవచ్చునని త్యాగి తెలిపారు. నితీష్ కుమార్ కి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ..తాము ఎన్డీయేలో ఉన్నామని..ప్రధానమంత్రి పదవికి తమ అభ్యర్థి నరేంద్రమోదీ అని త్యాగి పేర్కొన్నారు.

అలాంటప్పుడు అటువంటి తీర్మానం యొక్క ఆవశ్యకత గురించి మీడియా ప్రశ్నించగా..నితీష్ కుమార్ ప్రధాన మంత్రి అవకాశాలపై కొన్ని ప్రాంతాల నుండి తరచుగా సూచనలు వస్తున్నాయి మరియు మేము రికార్డును అందరి ముందు పెట్టాలనుకుంటున్నాము అని త్యాగి సమాధానమిచ్చారు.

ఇక, ఈ నెల ప్రారంభంలో జేడీయూ నేత ఉప్రేంద్రకుష్వాహ..పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన తర్వాత నితీష్ కుమార్ ..ప్రధాని కావాల్సిన వ్యక్తి అని పేర్కొన్న విషయం తెలిసిందే. నరేంద్రమోదీని ప్రజలు ప్రధానిని చేశారని..దేశంలో ప్రధాని అయ్యేందుకు అర్హతలు కలిగాన వారు కొందరు ఉన్నారని..అందులో నితీష్ ముందువరుసలో ఉంటారని ఉపేంద్ర కుష్వాహ వ్యాఖ్యానించారు. నితీష్ ని ప్రధాని మెటీరియల్ గా పిలవాలని.. దీని అర్థం మోదీని సవాల్ చేస్తున్నట్లు కాదు అని కుష్వాహ తెలిపారు.

అయితే, ఓ వైపు బీజేపీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తూ..మరోవైపు ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ ని ప్రకటిస్తే విపక్షాలతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ పరోక్షంగా సంతేకాలిస్తోంది జేడీయూ. అయితే జేడీయూ పార్టీ వ్యవహరంపై ఇప్పుడు బీజేపీలో పెద్ద చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

జేడీయూ  డిమాండ్ పై స్పందించిన బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం
జేడీయూ డిమాండ్ కి తాము మద్దతిస్తున్నామని..ఎందుకంటే వివిధ అంశాలపై కో ఆర్డినేట్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని బీహార్ డిప్యూటీ సీఎం తారకిషోక్ ప్రసాద్ అన్నారు.

ఇక,వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్ల కోసం జేడీయూ పట్టుబడుతోంది. అడిగినన్ని సీట్లు కేటాయిస్తే బీజేపీతో కలిసి పోటీలో ఉంటామని..లేకుంటే తాము సొంతంగానే రంగంలోకి దిగుతామని జేడీయూ సృష్టం చేసింది. అయితే తమ మొదటి ప్రాధాన్యత ఎన్డీయే కూటమి తరపున పోటీ చేయడం అని జేడీయూ సీనియర్ లీడర్ కేసీ త్యాగి పేర్కొన్నారు.

ALSO READ Caste-Based Census : కులాలవారీగా జనగణన..మోదీని కలిసిన బీహార్ అఖిలపక్షం