విమానాల రద్దు : ముంబయి-ఢిల్లీల మధ్య స్పెషల్ ట్రైన్స్ 

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 06:35 AM IST
విమానాల రద్దు : ముంబయి-ఢిల్లీల మధ్య స్పెషల్ ట్రైన్స్ 

ఆర్థిక సంక్షోభంలో పడిన జెట్ ఎయిర్‌వేస్ విమానాల రద్దు చేసిన విషయం తెలిసిందే.  ఈక్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ముంబయి-ఢిల్లీల మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ మూతపడటంతో పలు విమాన సర్వీసులు రద్దు చేసిది ఆ సంస్థ. దీంతో  ముంబయి- ఢిల్లీల మధ్య నడిచే 9 విమాన సర్వీసులు రద్దయ్యాయి. 
 

దీంతో రాజధాని, ఆగస్టు క్రాంతి, గోల్డెన్ టెంపుల్, దురంతో, గరీభ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. దీంతో ఈ మార్గాలలో స్పెషల్ ట్రైన్స్ వేస్తే అటు ఆదాయం పెరుగుతుంది. ఇటు ప్రయాణీకులకు సౌకర్యాన్ని పెంచినట్లుగా అవుతుంది రైల్వే శాఖ భావించింది. దీంతో ఈ మార్గంలో  ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ముంబయి- ఢిల్లీ మార్గంలో ప్రత్యే రైళ్లతో వాటికి అదనపు బోగీలతో నడపనున్నట్లు రైల్వేశాఖ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రవీంద్ర వెల్లడించారు.