రెడ్ లైట్ దాటాడు.. ఫైన్ పడింది : రూల్ తెచ్చిన రవాణా మంత్రికే ట్రాఫిక్ చలాన్

  • Published By: sreehari ,Published On : August 29, 2019 / 11:03 AM IST
రెడ్ లైట్ దాటాడు.. ఫైన్ పడింది : రూల్ తెచ్చిన రవాణా మంత్రికే ట్రాఫిక్ చలాన్

జార్ఖండ్ రవాణా శాఖ మంత్రి సీపీ సింగ్‌కు ట్రాఫిక్ చలాన్ పడింది. రెడ్ లైట్ దాటి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకుగాను రూ.వంద జరిమానా పడింది. రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి నియంత్రించేందుకు ఆయన అడ్వాన్స్ డ్ ట్రాఫిక్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు. అదే.. రెడ్ లైట్ వాయిలేషన్ డెటెక్షన్ (RLVD) సిస్టమ్. ఈ ట్రాఫిక్ సిస్టమ్‌ను రాష్ట్రంలో ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర ఇన్ స్టాల్ చేశారు. అలాగే మంత్రి సింగ్ నివాసం దగ్గర  కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రూల్స్ నిబంధనల ప్రకారం.. రెడ్ లైట్ క్రాస్ చేసిన వాహనంపై ట్రాఫిక్ ఉల్లంఘన కింద జరిమానా విధించడం జరుగుతుంది. జూన్ 22న రాంచిలోని సర్జనా చౌక్ ప్రాంతంలోని తన నివాసానికి వెళ్లే సమయంలో ఆయన ప్రయాణించే కారు రెడ్ లైట్ క్రాస్ చేసింది. 

వెంటనే ట్రాఫిక్ సిస్టమ్.. కారు నెంబర్ ప్లేట్ ఆటోమాటిక్‌గా రీడ్ చేసింది. అనంతరం మంత్రికి ట్రాఫిక్ చలాన్ రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాఫిక్ చలాన్ అందుకున్న మంత్రి తన తప్పును అంగీకరించారు. ఫైన్ కూడా కట్టేశారు. ఎన్నోసార్లు తాను ట్రాఫిక్ చలాన్లు చెల్లించినట్టు చెప్పారు. ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో కూడా ట్రాఫిక్ చలాన్లు చెల్లించినట్టు తెలిపారు. నిజానికి మంత్రి సింగ్ ఎస్కార్ట్ వాహనం అర్హత కలిగి ఉన్నప్పటికీ ఆయన Non-VIP వాహనంలోనే వెళ్తుంటారు.

ట్రాఫిక్ జంక్షన్లలో రూల్స్ ఉల్లంఘించే ఘటనలు పెరిగిపోతుండటంతో కొత్త ట్రాఫిక్ సిస్టమ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ సిస్టమ్ నియమనిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని మంత్రి తెలిపారు. కొన్ని ఏళ్ల క్రితం.. రాంచీ ట్రాఫిక్ పోలీసులు క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి జరిమానా విధించారు. ధోనీ తన కారు విండో అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడారనే కారణంతో ఫైన్ పడింది. మరోసారి తన వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ సరిగా లేదని జరిమానా విధించారు.