Awantipora Encounter..జైషే మొహమ్మద్ టాప్ కమాండర్ హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బుధవారం పుల్వామా ​జిల్లా అవంతిపోరాలోని త్రాల్​ ప్రాంతంలోతివారి మొహల్లా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మొహహ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన

Awantipora Encounter..జైషే మొహమ్మద్ టాప్ కమాండర్ హతం

Kashmir (6)

Awantipora Encounter జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బుధవారం పుల్వామా ​జిల్లా అవంతిపోరాలోని త్రాల్​ ప్రాంతంలోతివారి మొహల్లా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మొహహ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన టాప్ కమాండర్ షామ్ సోఫిని భద్రతా బలగాలు హతమార్చాయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.

ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయని… ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయని..ఈ క్రమంలోనే జైషే కమాండర్ హతమైనట్లు ఐజీపీ తెలిపారు.  ముష్కరులకు, భద్రతాసిబ్బందికి మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మరో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భావిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

గత మూడు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగడం ఇది ఆరోసారి. మంగళవారం పోషియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎల్‌ఈటీతో సంబంధాలున్న ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే.

కాగా, ఇటీవలే సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన పాక్ ప్రేరిత ఉగ్రవాదులు కశ్మీర్ లో ఐదుగురు సాధారణ పౌరులను చంపివేసిన విషయం తెలిసిందే. కశ్మీర్ లో మైనార్టీలైన హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని మారణకాండ జరిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ఉధృతం చేసింది. ఈ క్రమంలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి సహా ఐదుగురు సైనికులు చనిపోయారు. ఆ తర్వాత సైన్యం ఉగ్రవాదుల ఏరివేత మరింత ఉధృతం చేసింది. ఇటీవలే మొత్తం పది మంది ఉగ్రవాదులను హతమార్చింది.

ALSO READ  కనక వర్షం కురిపిస్తున్న టాటా షేర్లు