Kapil Sibal : నా శవం కూడా బీజేపీలో చేరదు – కపిల్ సిబాల్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్రంగా స్పందించారు. తాను కాదు..తన శవం కూడా బీజేపీలో చేరదని, ఆ భావజాలపు రాజకీయ పార్టీలోకి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లనని కుండబద్ధలు కొట్టారు.

Kapil Sibal : నా శవం కూడా బీజేపీలో చేరదు – కపిల్ సిబాల్

Kapil

Kapil Sibal : కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా జారిపోతున్నారు. బీజేపీ పార్టీలో చేరుతుండడంతో కాంగ్రెస్‌‌లో ఆందోళన వ్యక్తమౌతోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉండే నేతలు కూడా జంప్ అవుతుండడం నేతల్లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్ బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్రంగా స్పందించారు. తాను కాదు..తన శవం కూడా బీజేపీలో చేరదని, ఆ భావజాలపు రాజకీయ పార్టీలోకి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లనని కుండబద్ధలు కొట్టారు.

జితిన్ ప్రసాద్ చేరితో కాంగ్రెస్ పార్టీలో విబేధాలు స్టార్ట్ అయ్యాయని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై సిబాల్‌ను ప్రశ్నించగా..తాను పుట్టి పెరిగినప్పటి నుంచి బీజేపీని వ్యతిరేకిస్తూ వచ్చానన్నారు. పార్టీ నుంచి జితిన్ వెళ్లాలని అనుకుంటే..వెళ్లవచ్చు..ఆ పార్టీలో వెళ్లడం..అందులో దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్న రాజకీయాల వైపుకు వెళ్లడం..తాను తప్పుబడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తోందని, భావ జాలపరమైన రాజకీయాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనాల ప్రాతిపదిక కనిపిస్తోందని, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల పరిస్థితిని చూస్తే అర్థమౌతోందని సిబాల్ వ్యాఖ్యానించారు.

Read More : Telangana BJP : కేసీఆర్‌పై రాజకీయ పోరుకు సిద్ధం కావాలి – తరుణ్ చుగ్