Karnataka: ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? ఫలితాలు ఎలా వచ్చాయి?

కర్ణాటక ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా మాత్రమే పూర్తిస్థాయిలో సక్సెస్ అయింది. మిగతా సంస్థలు..

Karnataka: ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? ఫలితాలు ఎలా వచ్చాయి?

Karnataka exit polls

Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. ఈ నెల 10న ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) వచ్చాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా మాత్రమే పూర్తిస్థాయిలో సక్సెస్ అయింది.

న్యూస్ నేషన్-సీజీఎస్, సువర్ణ న్యూస్-జాన్ కీ బాత్ సంస్థలు మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి.  మిగతా సంస్థలు ఏం చెప్పాయో చూద్దాం…

ఎగ్జిట్ పోల్స్‌లో ఏ సంస్థ ఏం చెప్పింది?

ఏబీపీ న్యూస్-సీ ఓటర్
బీజేపీ 83-95, కాంగ్రెస్ 100-112, జేడీఎస్ 21-29

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా
బీజేపీ 62-80, కాంగ్రెస్ 122-140, జేడీఎస్ 20-25

ఇండియా టీవీ-సీఎన్ఎక్స్
బీజేపీ 80-90, కాంగ్రెస్ 110-120, జేడీఎస్ 20-24

న్యూస్ 24-టుడేస్ చాణక్య
బీజేపీ 92, కాంగ్రెస్ 120, జేడీఎస్ 12

న్యూస్ నేషన్-సీజీఎస్
బీజేపీ 114, కాంగ్రెస్ 86, జేడీఎస్ 21

రిపబ్లిక్ టీవీ-పీమార్క్
బీజేపీ 85-100, కాంగ్రెస్ 94-108, జేడీఎస్ 24-32

సువర్ణ న్యూస్-జాన్ కీ బాత్
బీజేపీ 94-124, కాంగ్రెస్ 91-106, జేడీఎస్ 14-24

టీవీ9 భారత్ వర్ష్- పోల్ స్టాట్
బీజేపీ 88-98, కాంగ్రెస్ 99-109, జేడీఎస్ 21-26

జీన్యూస్-మ్యాట్రైజ్
బీజేపీ 79-94, కాంగ్రెస్ 103-118, జేడీఎస్ 25-33

పైన పేర్కొన్న తొమ్మిది సంస్థల్లో నాలుగు సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెప్పాయి. మరో మూడు సంస్థలు ఏ పార్టీకీ 113 సీట్లు రావని తెలిపాయి. మిగిలిన రెండు సంస్థలు మాత్రం బీజేపీకి అధికారం దక్కుతుందని చెప్పాయి.

ఫలితాలు ఎలా వచ్చాయి?
కాంగ్రెస్ పార్టీకి 136 సీట్లు
బీజేపీకి 65 సీట్లు
జేడీఎస్ కి 19 సీట్లు
కల్యాణ రాజ్య ప్రగతి పక్షం పార్టీకి ఒక సీటు
సర్వోదయ కర్ణాటక పక్షం పార్టీకి ఒక సీట్లు
మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం

ఎన్నికల సంఘం వెల్లడించిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 136 సీట్లు దక్కాయి. అంటే కాంగ్రెస్ అధికారంలో వస్తుందని మెజార్టీ (నాలుగు) సంస్థలు చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. మరో మూడు సంస్థలు కాంగ్రెస్ కి అధిక సీట్లు వచ్చినా 113 సీట్లు రావని అన్నాయి.

DK vs Siddaramaiah: ఫలితాలు వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోస్టర్ వార్