Meesakkari : నా మీసం నా ఇష్టం-మీసాల మహిళ

కేరళ కన్నూరు లోని కుతుపరంబ అనే ప్రాంతానికి చెందిన శైజ‌కు యుక్త వయస్సు నుంచే పై పెదవి భాగంలో నూనూగు మీసాలు వచ్చాయి.

Meesakkari : నా మీసం  నా ఇష్టం-మీసాల మహిళ

Meesakkari

Meesakkari : పురుషులకు మొఖాన గడ్డం, మీసం అందం. కొందరూ రెండు తీసేసి క్లీన్ షేవ్ చేసుకుంటే అందంగా ఉంటారు. కొందరు గడ్డం తీసేసి మీసకట్టుతో అందంగా కనిపిస్తారు. అలాగే కొంతమంది మహిళల్లో అవాంఛిత రోమాలు మొఖం మీద వస్తుంటాయి. హర్మోన్ల ప్రభావం వల్ల ఇలాగ వస్తుంటాయి. ఎంతఖర్చైనా సరే అవాంఛిత రోమాలను తొలగించుకుంటారు. కానీ కేరళలోని చెందిన శైజ(35) అనే మహిళ తన ముఖం మీద వచ్చిన మీస కట్టును అందంగా తీర్చిదిద్దింది.

కేరళ కన్నూరు లోని కుతుపరంబ అనే ప్రాంతానికి చెందిన శైజ‌కు యుక్త వయస్సు నుంచే పై పెదవి భాగంలో నూనూగు మీసాలు వచ్చాయి. కొన్నాళ్లకు అవి పెరగటం ప్రారంభమయ్యింది. అలాపెరిగి అది కోరమీసంలా ఒత్తుగా మారిపోయింది.  దీంతో ఆమె మీసాన్ని అందంగా తీర్చి దిద్దుకుంది.  మీసం లేకుండా తన మొఖాన్ని ఊహించుకోలేని అని చెపుతోంది.

అప్పుడప్పుడూ ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయించుకుంటాను… కానీ మీసాన్ని ఇంతవరకు టచ్ చేయలేదని చెప్పింది. మీసమంటే తనకు ఇష్టమని చెబుతోంది. కోవిడ్ సమయంలో కూడా ఆమె మాస్క్ పెట్టుకోలేదుట. అందమైన మీసాలతో ఆమె తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  దీంతో ఆమెన మీసక్కరి (మీసంతో ఉన్న మహిళ) అని చాలా మంది కామెంట్స్ చేశారు.

అప్పుడు ఆమె మీసక్కరి అనే పేరుతో మరోక సోషల్ మీడియా ఎకౌంట్ ఓపెన్ చేసి అందులో తన ఫోటోలు పోస్ట్ చేసింది. చాలా మంది మీసాలు తొలగించుకోమని సలహా ఇచ్చినా అందుకు ఆమె ఇష్టపడటంలేదని తెలిపింది.  కాగా… ఆమెకు మీసం విషయంలో తల్లి తండ్రుల కుటుంబ సభ్యులు కూడా మద్దతు ఇవ్వటం విశేషం. తమ కుమార్తె మీస కట్టుతోనే అందంగా ఉంటుందని తల్లి తండ్రులు చెప్పారు.

నాకు నా భర్తకు రానిఇబ్బంది ఇతరులకు ఎందుకో అర్ధకాదని ఆమె అన్నారు. ఎన్ని విలువైన బహుమానాలు ఇచ్చినా నా మీసాన్ని మాత్రం తీసివేయనని ఆమె తెలిపారు. కాగా.. మీసాలు గడ్డాలు ఉన్నవారిలో శైజ ఒక్కతే కాదు… గతంలో హర్మామ్ కౌర్ అనే మహిళ కూడా మీసాలు గడ్డాలతో వార్తల్లో నిలిచింది.