Snake’s Thirst : మండుటెండ, పాముకు నీళ్లు తాగించాడు

దాహమేసిన ఓ పాము..జనావాసాల మధ్యలోకి వచ్చేసింది. ఓ వ్యక్తి మాత్రం దాని పరిస్థితిని అర్థం చేసుకుని..దాహార్తిని తీర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Snake’s Thirst : మండుటెండ, పాముకు నీళ్లు తాగించాడు

Snake

Kind man seen quenching a battling scorching summer : పామును చూస్తే..వామ్మో..అంటూ భయపడిపోతాం. లేదా..దానిని చంపేందుకు ప్రయత్నించడం..అక్కడి నుంచి పంపించే విధంగా ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఎండాకాలం సీజన్ నడుస్తోంది. మనుషులే అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నడి నెత్తిన సూర్యుడు భగ్గుమంటుంటే…బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మనుషులే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటే..మూగ జీవాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మండుటెండలను భరించలేక మూగ జీవాలు అష్టకష్టాలు పడుతున్నాయి. ప్రధానంగా దాహార్తిని తీర్చుకోవడానికి జనాల్లోకి వచ్చేస్తున్నాయి. అలాగే దాహమేసిన ఓ పాము..జనావాసాల మధ్యలోకి వచ్చేసింది. ఓ వ్యక్తి మాత్రం దాని పరిస్థితిని అర్థం చేసుకుని..దాహార్తిని తీర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమిళనాడులోని కడలూరు అటవీ ప్రాంతం నుంచి ఓ పాము సమీపంలో ఉన్న గ్రామంలోకి వచ్చింది. తీవ్ర దప్పికతో బాధ పడుతున్న ఆ పాముకు బాటిల్ సాయంతో నీళ్లు తాపాడు. భూమి మీద నీళ్లు పోసిన తర్వాత..పాము తన దాహార్తిని తీర్చుకుంది. అనంతరం ఆ పామును అడవిలో వదిలిపెట్టాడు. ఇతను సెల్వాగా గుర్తించారు. ఈ వీడియో చూసిన వారు..ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More : Mehreen Pirzada : కాబోయే భర్తతో ఏకాంతంగా