రాత్రికి రాత్రే లక్షాధికారులైన కూలీలు

రాత్రికి రాత్రే లక్షాధికారులైన కూలీలు

panna వారంతా కూలీలు. రెక్కల కష్టం చేస్తే కానీ పూటగడవని పరిస్థితి. అలాంటి వారికి లక్ష్మీదేవి తలుపు తట్టింది. రాత్రికి రాత్రే లక్షాధికారులు అయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నాలో ఈ ఘటన జరిగింది.

భగవాన్​దాస్​ కుష్వాహ్​ అనే కూలీ, అతని నలుగురు మిత్రులు కలిసి రంగురాళ్ల భూమిగా పేరొందిన పన్నాలోని ఇట్వాకాస్ గ్రామం వద్ద కొంత ప్రాంతాన్ని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నారు. అక్కడ తవ్వకాలు జరిపి వజ్రాల కోసం తీవ్రంగా వెతికారు. సోమవారం భగవాన్​కు కీతా వజ్రాల గనిలో రెండు వజ్రాలు దొరికాయి. వాటిలో ఒకటి 7.93 క్యారెట్లు, మరొకటి 1.93 క్యారెట్లు ఉంది.

భగవాన్,​ అతని మిత్రులకు దొరికిన రెండు వజ్రాలను వచ్చే నెలలో వేలం వేయనున్నట్లు పన్నా కలెక్టర్​ సంజయ్​ కుమార్ మిశ్రా తెలిపారు. వజ్రాలు చాలా స్వచ్ఛంగా ఉన్నట్లు పేర్కొన్నారు.దొరికిన వజ్రాలను వేలంపాట వేయనున్న నేపథ్యంలో వాటి నుంచి వచ్చే మొత్తంతో అప్పు తీర్చుకుంటామని కూలీలు తెలిపారు. దీంతో తాము ఆర్థికంగా నిలదొక్కుకోగలమని చెప్పారు.. బహిరంగ మార్కెట్లో ఆ ధర రూ.35 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.