హ్యాట్సాఫ్ అమ్మలూ : లద్ధాఖ్ సరిహద్దుల్లో సైనికుల ఆకలి తీర్చటానికి గడ్డకట్టే చలిలో మహిళల డ్యూటీ..

హ్యాట్సాఫ్ అమ్మలూ : లద్ధాఖ్ సరిహద్దుల్లో సైనికుల ఆకలి తీర్చటానికి గడ్డకట్టే చలిలో మహిళల డ్యూటీ..

Ladakh all women crew lpg Gas plant : శీతాకాలం వస్తే లద్దాఖ్‌కు వెళ్లే రోడ్లన్నీ మంచు దుప్పటి కప్పుకున్నట్లే ఉంటాయి. ఇది చూడటానికి చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది. మంచువల్ల వాహనాల రాకపోకలన్నీ నిలిచిపోతాయి. దీంతో సరిహద్దులో ప్రాణాలు పణ్ణంగా పెట్టి కావలికాసే మన జవాలన్లకు ఇక్కట్లు తప్పవు. సరిహద్దుల్లో 50 వేల మంది సైనికుల ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని కళ్లల్లో ఒత్తులు వేసుకుని కావలికాస్తుంటారు. వారి కష్టాల్ని మాటల్లో చెప్పలేం. కాసిని టీ నీళ్లు గొంతులో పోసుకోవన్నా కష్టమే. గడ్డకట్టే చలిలో టీ కాసుకోవాలన్నా..కసరత్తులు చేయాల్సిందే. గడ్డకట్టిన నీళ్లను టీగా మార్చటానికి వాళ్లు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఇక భోజనం వండాలంటే ఇక వాళ్ల పాట్లు గురించి చెప్పటానికి మాటలురావు. వాళ్లకు అన్నింటికీ గ్యాస్ తప్పనిసరి. కానీ ఆ గ్యాస్ సిలిండర్లు అక్కడకు వెళ్లాలంటే మాటలు కాదు..లద్ధాఖ్ సరిహద్దుల్లో ఉండే జవాన్లకు ఆహారం వండాలంటే గ్యాస్ సిలిండర్లు ఉండాల్సిందే. వారికి లద్దాఖ్‌లో ఉన్న ఏకైక ఇండియన్‌ ఆయిల్‌ ఎల్‌పీజీ ప్లాంటే శరణ్యం.

ఇండియన్‌ ఆయిల్‌ ఎల్‌పీజీ ప్లాంట్..లో పనిచేసేవారంతా మహిళలే. ఇది ‘ఆల్‌ ఉమెన్‌ క్రూ ప్లాంట్’ లో 12మంది మహిళలకు పనిచేస్తుంటారు. ఆ 12 మంది స్త్రీలు గడ్డ కట్టే చలిని కూడా లెక్క చేయక సిలిండర్లలో గ్యాస్‌ నింపిన ఆ సిలిండర్లను సైనికులకు చేర్చే బాధ్యత వారిదే. వాళ్లు గ్యాస్ సిలిండర్లు చేర్చకపోతే జవాన్లు ఆకలి తీరదు. అలా మన సైనికుల ఆకలి తీర్చటానికి ఆ 12మంది మహిళలు గడ్డకట్టే చలిని కూడా లెక్క చేయకుండా డ్యూటీ చేస్తుంటారు. అలా ఈ గ్యాస్ ప్లాంట్ లో పనిచేయటానికి సెరింగ్‌ ఆంగ్‌మో అనే మహిళ ఆ ప్లాంట్‌కు రావాలంటే 20 కిలోమీటర్ల దూనం నుంచి వస్తుంది. రిగ్‌జిన్‌ లాడో అనే మరో మహిళ అయితే 35 కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది ఉద్యోగానికి. అలాగే మిగిలిన పది మంది స్త్రీలు కూడా అంతే ఎంతో దూరం నుంచి వస్తారు. వీరంతా వివాహితలే. 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారే.

తెల్లవారు జామునే లేచి ఇంటి పనులు చక్కబెట్టి, పిల్లలకు, భర్తలకు కావలసినవి చూసి ఎల్‌పీజీ ప్లాంట్‌కు తీసుకెళ్లే బస్‌ కోసం వచ్చి బయట నిలబడతారు. వీళ్లంతా కాంట్రాక్ట్ ఉద్యోగులే. వాళ్లు ఆ బస్‌ మిస్‌ అయితే ఆ రోజుకు డ్యూటీ లేనట్లే. ప్లాంట్‌ వరకూ నడకద్వారా రావాలంటే అసాధ్యం. బస్సులో రావాలన్నా కూడా చలిలో చాలా కష్టమే. లద్దాఖ్‌కు సమీపంలోనే ఇండియన్‌ ఆయిల్‌ వారు ఒక ఎల్‌పీజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఉన్నారు. లద్దాఖ్‌ మొత్తానికి ఇది ఒక్కటే ఫిల్లింగ్‌ ప్లాంట్‌. మామూలు రోజుల్లో ఇక్కడ ఫిల్ అయ్యే సిలిండర్లు సామాన్య ప్రజల కోసమే అయినా శీతాకాలంలో ఈ ప్లాంట్‌ అవసరం మరీ మరీ పెరుగుతుంది. ఎందుకంటే దేశం నుంచి గ్యాస్‌ సిలిండర్లు సైనికులకు వెళ్లే మార్గాలన్ని మంచుతో కప్పబడిపోతాయి. లద్దాఖ్‌ సరిహద్దున దేశ కాపలా కాసే దాదాపు 50 వేల మంది సైనికులు డ్యూటీలో మరింత అప్రమత్తంగా ఉంటారు. వారికి ఆహారం వండాలంటే గ్యాస్‌ తప్పనిసరి. అప్పుడు ఈ ప్లాంట్‌లో తయారయ్యే దాదాపు 40 శాతం సిలిండర్లు సైనిక స్థావరాలకు చేరుతాయి.

ఈ ప్లాంట్ లో పనిచేసే పద్మా సోగ్యాల్‌ అనే మహిళ మాట్లాడుతూ.. ‘నేను ఈ ప్లాంట్‌లో చేరినప్పుడు నాకు సిలిండర్‌కు రెగ్యులేటర్‌ బిగించడం కూడా రాదు. కానీ ఇప్పుడు ప్లాంట్‌ నుంచి బయటకు వెళ్లే సిలిండర్‌ క్వాలిటీ చెక్‌ చేయగలిగేలా వర్క్ నేర్చుకున్నాను అని తెలిపింది. పద్మా సోగ్యాల్ ప్రతీరోజు చోగ్లమ్‌సర్‌ అనే ప్రాంతం నుంచి డ్యూటీ వస్తుంది. ‘నేను నా దేశం కోసం ఎంతో కొంత చేయగలుగుతున్నాను అన్న సంతోషం ఉంటుంది ఈ పనిలో అంటుంది పద్మ. ఈ ప్లాంట్‌లో సెక్యూరిటీ గార్డులుగా, లోడ్‌ ఆపరేటర్లుగా మాత్రమే మగవారు ఉన్నారు. మిగిలిన టెక్నికల్‌ వర్క్‌ అంతా ఆడవారేనని చెప్పింది. ‘గడ్డ కట్టే చలిలో కూడా మహిళలు ఏమాత్రం విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా వర్క్ చేయటానికి ఏమాత్రం వెనుకాడరని తెలిపింది. మహిళలు తలచుకంటే ఏదైనా చేయగలరనే స్త్రీ శక్తికి ఉదాహరణ ఇది’ అంటారు ఇండియన్‌ ఆయిల్‌ అధికారి ఒకరు.

కాగా ఈ ప్లాంట్ లో పనిచేసే మహిళా ఉద్యోగులు అందరూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులే. అంతంత దూరం నుంచి రోజూ వచ్చి పోతున్నందుకు బాధా లేదు.‘ఈ పనిని మేము సంతోషంగా చేస్తున్నాం’ అంటారు ఆ 12 మంది మహిళలు. ఈ పనిలో మేం దేశం కోసం ఎంతో కొంత చేయగలుగుతున్నామని తృప్తి ఉంది. అందుకే ఎంత కష్టమైన వాతావరణంలో అయినా సరే వస్తాం..పనిచేస్తాం అంటున్నారీ 12మంది మహిళలు. చాలామంది మహిళలు నగరాల్లో, పట్టణాల్లో పనులు చేస్తుంటారు. కానీ మన కోసం సరిహద్దుల్లో సైనికులు పని చేస్తుంటారు. వారి కోసం వారి కడుపులు నింపటం కోసం పని చేయటం చాలా గర్వంగా ఫీలవుతుంటామని వీరు అంటుంటారు. దేశపు ప్రతి అవసరం లో స్త్రీ శ్రమ ఉందని తెలుసుకోవడం..ఎంతైనా అవసరం. స్త్రీల శక్తియుక్తులను అంచనా వేయటం అంత తేలికైనదికాదు. లద్దాఖ్‌ సమీపంలో ఈ ‘ఆల్‌ ఉమెన్‌ క్రూ ప్లాంట్’ లో పనిచేసే మహిళా శక్తులకు సెల్యూట్‌ చెబుదాం..సెల్యూట్‌ మహిళా శక్తి..