మిడతల కారణంగా విమానాలకు పొంచి ఉన్న ప్రమాదం

  • Published By: Subhan ,Published On : May 29, 2020 / 02:52 PM IST
మిడతల కారణంగా విమానాలకు పొంచి ఉన్న ప్రమాదం

మిడతల వల్ల పంటకు, మొక్కలకే కాదు.. విమానాలకు కూడా ప్రమాదం పొంచి ఉందంటున్నారు సివిల్ ఏవియేషన్ డైరక్టరేట్ జనరల్. శుక్రవారం ఈ మేర హెచ్చరికలు జారీ చేశారు. మూడు దశాబ్దాలుగా ఇంతటి దారుణమైన పరిస్థితులు వెస్టరన్, సెంట్రల్ ఇండియాల్లో ఎప్పుడూ చూడలేదు. ఎయిర్‌లైన్ సర్కూలర్ ఏవియేషన్ డాగ్ ఇలా చెప్పింది.

‘సాధారణంగా మిడతలు చాలా తక్కువ ఎత్తులోనే తిరుగుతాయి.  ఇవి ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ముప్పుగా మారొచ్చు. విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ ల సమయంలో వాటి ఎత్తుపరిధిలోనే ఉండటంతో సమస్యగా మారతాయి. ఎయిర్‌‌క్రాఫ్ట్ చాలా భాగాలు ఇటువంటి పురుగులు చొచ్చుకుపోవడానికి వీలుగా ఉంటాయి. ఇంజిన్ ఇన్లెట్, ఎయిర్ కండిషనింగ్ ప్యాక్ ఇన్లెట్ వంటివి’ అని ఆ నోట్లో రాసుకొచ్చాడు. 

‘ఒక్కో మిడత పరిమాణంలో చాలా చిన్నగా ఉంటుంది. అవే ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తే పైలట్ దృష్టికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో ఇలా జరిగితే చాలా ప్రమాదం. వైపర్స్ వాడి వాటిని చెదరగొడదామంటే అలా చేస్తే అవి ఇంకా పెరిగిపోతాయి. పైలట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి’ అని డీజీసీఏ అన్నారు. 

మిడతలు ప్రయాణిస్తుంటే విమానాలు ఆ ప్రాంతానికి వీలైనంత దూరంగా ప్రయాణిస్తే మంచిది. ఒకే ఒక్క సానుకూలాంశం ఏంటంటే మిడతలు రాత్రి సమయాల్లో ప్రయాణించవు. అలాంటప్పుడు మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు’ అని ఆ సర్కూలర్ లో రాసుకొచ్చారు. ఇప్పటికే ఈ మిడతల దండు 50వేల హెక్టార్ల పంటభూమిని పాడుచేశాయి.