ఫిఫ్టీ – ఫిఫ్టీ : స్కూ-సైకిల్ వెహికల్ భలే ఉందే..

  • Published By: nagamani ,Published On : August 28, 2020 / 12:43 PM IST
ఫిఫ్టీ – ఫిఫ్టీ :  స్కూ-సైకిల్ వెహికల్ భలే ఉందే..

స్కూలుకెళ్లే విద్యార్ధి ‘‘నాన్నా నాకో సైకిల్ కొనిపెట్టు’’అని అడుగుతాడు..అదే కాలేజీకెల్లే అబ్బాయి ‘నాన్నా నాకో బైక్ కొనిపెట్టు’’అని అడుగుతాడు. ఏయ్..సైకిలూ లేదు..బైకు లేదు అని తిడతాడు. కానీ కొడుకు అడిగిన వాహనం కొనివ్వాలని తండ్రికి మనసులో ఉంటుంది. కానీ భయం ఒకపక్క..అయ్యో వాడి సరదా తీర్చలేకపోతున్నాననే బాధ మరో పక్కా ఉంటుంది. కానీ ఇవేవీ కాకుండా పేదరికంలో ఉండే తండ్రిని ఓ కొడుకు అలా అడిగితే మాత్రం ..ఆ తండ్రి మనస్సు మాత్రం నిజంగా బాధపడుతుంది..కొడుకు అడిగిన బైక్ కొని ఇవ్వలేకపోయినందుుకు..



అటువంటిదే పంజాబ్, లూథియానాలో ఓతండ్రి బాధ “నాన్నా నాకో సైకిల్ కావాలి” అన్నాడు 8వ క్లాస్ చదువుతున్న కొడుకు. “రేయ్… తినడానికే డబ్బుల్లేవు… ఇక సైకెల్ లేం కొంటాన్రా..నడిచి వెళ్లు అని కోపంగా అన్నాడు.కానీ.. ఏదో తెలియని బాధ. కొడుకుకు కనీసం సైకిల్ కూడా కొనివ్వలేకపోతున్నానే అనే ఫీలింగ్. తన కొడుకు ఏమీ పెద్ద బైక్ కావాలని అడగలేదు. చిన్న సైకిల్ మాత్రమే అడిగాడు..దాన్ని కూడా కొనివ్వలేకపోతున్నానని బాధపడ్డాడు. కానీ ఏం చేసైనా సరే… కొడుకు కోరిక తీర్చాలి అనుకున్నాడు.

పాత సైకింల్ పార్టులు, పాత స్కూటర్ పార్టులూ… కలిపేసి… స్కూ-సైకిల్ (స్కూటర్-సైకిల్) తయారుచేశాడు. ఈ తయారీలో తండ్రి..కొడుకూ కలిసి వారి ఆలోచనలకు పదును పెట్టి ఈ . స్కూ-సైకిల్ (స్కూటర్-సైకిల్) తయారుచేశారు.



దీని ముందు భాగం స్కూటర్‌లా..వెనకేమో సైకిల్. ముందు చక్రం స్కూటర్‌ది. వెనక చక్రం సైకిల్‌ది. దీన్ని నడపాలంటే మాత్రం పెడల్స్ తొక్కాల్సిందే. అంటే ఇది సైకిలే. దీన్ని ఎవరైనా ముందు నుంచి చూస్తే స్కూటరే అనుకుంటారు..వెనకనుంచి చూస్తే మాత్రం సైకిలనే అనుకుంటారు.పక్కనుంచి వెళితే మాత్రం ఆశ్చర్యపోకత తప్పదు. ఎందుకంటే అది సగం స్కూటర్. సంగం సైకిల్ అని తెలుస్తుందిగా..కష్టాన్ని క్రియేటివ్‌గా మార్చి ఓ విచిత్ర వాహనం తయారుచేసి ఈ తండ్రీకొడుకులకు ప్రశంసలు కురుస్తున్నాయి.

https://10tv.in/walmart-is-teaming-up-with-microsoft-on-tiktok-bid/
ఇప్పుడు లఖోవాల్ గ్రామంలో ఈ విచిత్రమైన వాహనం ఉన్న కుటుంబం సెలబ్రిటీ అయిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కరోనా కాలంలో ఇటువంటి కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తున్నాయి మరి జనాలకు. కేవలం 24 గంటల్లో ఈ వీడియోని లక్ష మందికి పైగా చూశారు. 4వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇంత బాగా ఆలోచించగలిగినందుకు ఆ మాత్రం రాకుండా ఎలా ఉంటాయి? దటీజ్ కరోనా కాలపు క్రియేటివిటీ అనుకోవచ్చు..