17 Minutes Marriage : ఇద్దరూ ధనవంతులే..భోజనాలు లేవు..కట్నం ప్రసక్తే లేదు..17 నిమిషాల్లోనే పెళ్లి పూర్తి

ఓ జంట సింపుల్ గా కేవలం 17 నిమిషాల్లోనే పెళ్లి చేసుకున్నారు. పైగా ఈ పెళ్లిలో కట్నం అనే మాటే లేకపోవటం మరో విశేషం. వరుడు మనీష్ దాస్, వధువు గరీమా దాసిల పెళ్లి వేడుక చాలా సింపుల్ గా కేవలం 17 నిమిషాల్లోనే చేసుకున్నారు. ఇద్దరూ దనవంతులే అయినా ఇలా సింపుల్ గా వివాహం చేసుకోవటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

17 Minutes Marriage : ఇద్దరూ ధనవంతులే..భోజనాలు లేవు..కట్నం ప్రసక్తే లేదు..17 నిమిషాల్లోనే పెళ్లి పూర్తి

17 Minutes Marriege

17 Minutes Marriege : పెళ్లి అంటే చాలు లక్షలు..కోట్లు కూడా ఖర్చుపెట్టి చేసుకుంటున్నారు. హంగులు..ఆర్భాటాలు. బారాత్ లు..భారీ భారీ మెనూలతో వైభవంగా చేసుకుంటున్నారు. కానీ ఈ కరోనాకాలంలో ఆర్భాటాలు తగ్గిపోయాయి. ధనవంతులైనా సరే సింపుల్ గా పెళ్లి కానిచ్చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా ఆర్భాటాలను మానలేదు. ఓ జంట దీనికి అతీతంగా సింపుల్ గా కేవలం 17 నిమిషాల్లోనే పెళ్లి పూర్తి చేసుకున్నారు. పైగా ఈ పెళ్లిలో కట్నం అనే మాటే లేకపోవటం మరో విశేషం.

మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌కు చెందిన వరుడు మనీష్ దాస్ కరేలి, వధువు గరీమా దాసిల పెళ్లి వేడుక చాలా సింపుల్ గా కేవలం 17 నిమిషాల్లోనే కానిచ్చేశారు. ఇద్దరూ ఏదోమధ్యతరగతి కుటుంబాల వారు కూడా కాదు బాగా ధనవంతులే. అయినా సరే సింపుల్ 17నిమిషాల్లోనే పెళ్లి చేసుకున్న వీరి వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వీరి కుటుంబం ఆచారం మేరకు..గురువు పవిత్ర పాదరక్షల సాక్షిగా వీరి వివాహం జరిగింది. వారి పూజ గదిలో గురువు పాదరక్షలు ఎదురుగా పెట్టుకుని వధూవరులిద్దరూ ఎదురెదురుగా కూర్చుని సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.అనంతరం వివాహానికి వచ్చిన అతిథులు వారిని ఆశీర్వదించి వెళ్లారు.

అత్యంత సాధారణంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిలో కట్నం ప్రసక్తే లేదు. పెళ్లికి బంధువులు, స్నేహితులు హాజరైనా విందు భోజనాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. మొత్తం 17 నిమిషాల్లో పెళ్లి కార్యక్రమాన్ని ముగించుకుని ఎవరింటికి వారు వెళ్లిపోవటం మరో విశేషం. ఎటువంటి హంగులు లేవు..హడివిడులు లేవు..భారీ భారీ మెనులు అసలే లేవు. అస్సలు భోజనాల పనేలేదు. పెళ్లికొచ్చిన అతిథులు వధూవరులను మనసారా ఆశీర్వదించి వెళ్లిపోయారు.

ఈ సింపుల్ పెళ్లి గురించి వరుడు మనీష్ దాస్ తండ్రి ఈకోవిడ్ సమయంలో ఇటువంటి వివాహాలే అందరికి మంచిదని..మన ఇంట్లో వివాహం జరుగుతోంది కదాని…అందరినీ ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. ఈ వివాహం ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఈ సింపుల్ వివాహం జరిగింది.