చేతిలో మహాభారతం బుక్ తో… మధ్యప్రదేశ్ గుహలో ముంబై ఇంజినీర్

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2020 / 02:19 PM IST
చేతిలో మహాభారతం బుక్ తో… మధ్యప్రదేశ్ గుహలో ముంబై ఇంజినీర్

కరోనా వైరస్ నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్చి 24 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచీ ఓ ఇంజినీర్ మధ్యప్రదేశ్‌లోని గుహలో ఉంటున్నట్లు ఆదివారం(ఏప్రిల్-19,2020)సాయంత్రం రైసన్ జిల్లా కనుగొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసే నవీ ముంబైకి చెందిన వీరేంద్ర సింగ్ డోగ్రా అనే  దేశంలోనే ప్రసిద్ధమైన ‘నర్మదా పరిక్రమణ’ చేస్తూ చేస్తూ….రైసన్ జిల్లాలోని ఉదయ్ పురా అడవుల్లో చిక్కుకుపోయాడు.

ఇక ఆ రోజు నుంచీ ఆయన అడవుల్లో ఉన్న గుహలోనే ఉండిపోయాడు. అతని వద్ద బట్టల జతలతో పాటు ‘మహా భారతం’ బుక్ కూడా ఉన్నట్లు తెలిపారు. ఆదివారం పశువుల కాపర్లు ఆ దారిలో వెళ్తుండగా… ఆ యువకుడ్ని చూసి… వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆయన్ని ప్రశ్నించగా… తాను ముంబైకి చెందినవాడినని చెప్పి, హైదరాబాదులో ఉంటున్న తన సోదరికి పోలీసులతో ఫోన్ చేయించాడు.

రైసన్ ఎస్పీ మోనికా సుక్లా మాట్లాడుతూ….వీరేంద్ర సింగ్ నర్మదా పరిక్రమను ప్రారంభించారు. కానీ లాక్‌డౌన్ కారణంగా తన ప్రయాణాన్ని మధ్యలోనే వదిలేశాడు అని తెలిపారు. నర్మదా పరిక్రమ… దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన పరిక్రమ. మధ్యప్రదేశ్‌లోని అమర్ కంటక్‌ నుంచి గుజరాత్ లోని నర్మదా నది ముఖద్వారం వరకూ కాలినడకన భక్తులు ప్రదక్షిణ చేస్తారు. వీరేంద్రను కుందేవ్రి అనే గ్రామంలో ఉంటున్న అతని బంధువుల ఇంట్లో పోలీసులు సురక్షితంగా విడిచిపెట్టారని ఎస్పీ తెలిపారు. 

Also Read | లాక్ డౌన్ : ఆకలి తట్టుకోలేక కప్పలను తిన్న చిన్నారులు