Vaccine miracle : కరోనా రాకుండా వ్యాక్సిన్ వేయించుకుంటే కంటిచూపు తిరిగి వచ్చింది..!

కరోనా వ్యాక్సిన్ ఓ మహిళ జీవితంలో వెలుగులు నింపింది. కరోనా సోకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేయించుకున్న 70 ఏళ్ల మహిళకు కంటి చూపు తిరిగి వచ్చిన అద్భుతం జరిగింది మహారాష్ట్రలో.

Vaccine miracle : కరోనా రాకుండా వ్యాక్సిన్ వేయించుకుంటే కంటిచూపు తిరిగి వచ్చింది..!

Vaccine Miracle In Maharashtra Woman's Life (1)

Vaccine miracle In Maharashtra woman’s life : కరోనా మహమ్మారి సోకుండా ఉండేందుకు దాన్ని నివారించేందుకు వ్యాక్సిన్ వేయించుకుంటాం. అలా ఓ మహిళ వేయించుకున్న వ్యాక్సిన్ వల్ల ఆమెకు ఓ అద్భతం జరిగింది. గతంలో కంటిచూపు కోల్పోయిన ఆమెకు తిరిగి కంటి చూపు తిరిగి వచ్చింది. అంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక ఆమెకు కంటి చూపు చక్కగా కనిపిస్తోంది. ఈ అద్భుతమైన ఘటన మహారాష్ట్రలోని వాషిమ్ ప్రాంతంలో జరిగింది.

టీకాలు వేయించుకుంటే పిల్లలు పుట్టరనీ..లేదా సైడ్ ఎఫెక్ట్ వస్తాయని అనారోగ్యం పాలవుతారనే పుకార్లు వస్తున్న క్రమంలో చాలామంది ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటానికి వెనుకాడుతున్న క్రమంలో మహారాష్ట్రంలో మధురాబాయి బిద్వే అనే 70 ఏళ్ల మహిళకు జరిగిన అద్భుతం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వాషిమ్ జిల్లా బెందర్ వాడి గ్రామానికి చెందిన మధురాబాయి బిద్వే అనే 70 ఏళ్ల వృద్ధురాలికి కంటిశుక్లం సమస్యతో 9ఏళ్ల క్రితం చూపు కోల్పోయింది. అప్పటినుంచి ఆమె చీకటి జీవితాన్నే గడుపుతోంది. ఆమె తన బంధువులతో కలిసి రిసోడ్ తహసీల్ లో నివాసముంటోంది.

కంటిశుక్లం తెల్లగా మారడంతో దృష్టి కోల్పోయి గత 9 సంవత్సరాల నుంచి చీకటి జీవితాన్ని గడుపుతోంది. ఈక్రమంలో కరోనా మహమ్మారి సోకకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. దీంతో కరోనా సోకుండా మధురాబాయి బంధువుల సహాయంతో జూన్ 26న వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి..‘కోవిషీల్డ్ వ్యాక్సిన్’ మొదటి డోసు వేయించుకుంది.

ఆ తరువాత ఆమెకు కంటిచూపు క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. అలా ఇప్పుడు 30 నుంచి 40 శాతం దాకా కంటిచూపు కనిపిస్తోందని తాను వ్యాక్సిన్ వేయించుకున్న తరువాతే తనకు కంటిచూపు మెరుగుపడుతోందని మధురాబాయి ఆనందంగా చెబుతోంది. కోవిషీల్డ్ టీకా తీసుకున్న మరుసటి రోజు కంటిచూపు రావడంతో మధురాబాయి సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బు అవుతోంది. ఇక తన జీవితం చీకటిలోనే గడపాలను తాను అనుకున్నానని కానీ..కరోనా వ్యాక్సిన్ నా జీవితంలో వెలుగులు నింపింది అని మధురాబాయి తెగ ఆనందపడిపోతోంది.