Maharashtra Cabinet: రెండు వర్గాలకు సమానంగా..! కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్.. మంత్రులుగా 18 మంది ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 18మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేశారు. రెండు వర్గాలకు మంత్రివర్గంలో సమన్యాయం కల్పించారు. షిండే వర్గం నుంచి తొమ్మిది మంది, బీజేపీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Maharashtra Cabinet: రెండు వర్గాలకు సమానంగా..! కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్.. మంత్రులుగా 18 మంది ప్రమాణ స్వీకారం

Maharashtra New Cabinet

Maharashtra Cabinet: మహారాష్ట్ర లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 18మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేశారు. మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య ఏక్‌నాథ్ షిండే వర్గం, బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొత్తం 18మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో షిండే వర్గం నుంచి తొమ్మిది మంది, బీజేపీ నుంచి మరో తొమ్మిది మంది ఉన్నారు. మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ 18మంది నూతన మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

Maha Cabinet Expansion: 15న కేబినెట్ విస్తరణ.. ఫడ్నవీస్‭కు హోంశాఖ!

ఇదిలాఉంటే మంత్రివర్గ విస్తరణకు ముందు షిండే, బీజేపీ నాయకత్వం మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఎవరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే విషయాలపై అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ పెద్దలతో ముఖ్యమంత్రి షిండే చర్చలు జరిపారు. మంత్రివర్గ కూర్పు చూస్తుంటే ఇటు షిండే వర్గంలోని ఎమ్మెల్యేల్లో, బీజేపీ ఎమ్మెల్యేల్లో విమర్శలకు తావులేకుండా సమతుల్యతతో మంత్రి వర్గంలో రెండు వర్గాలకు స్థానం కల్పించారు.

Aaditya Thackeray on Eknath Shinde: ఏక్‭నాథ్ షిండేపై విరుచుకుపడ్డ ఆదిత్య థాకరే

కేబినెట్ బెర్త్ పొందిన బీజేపీ ఎమ్మెల్యేలలో చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్ ఉన్నారు. సురేష్ ఖాడే, రాధాకృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్‌కుమార్ గావిట్ తో పాటు అతుల్ సేవ్ లు ఉన్నారు. అదేవిధంగా ఏక్‌నాథ్ షిండే వర్గం నుంచి దాదా భూసే, సందీపన్ బుమ్రే, ఉదయ్ సమంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్, శంభురాజే దేశాయ్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్.. షిండే వర్గానికి మద్దతు తెలిపిన ఉద్ధవ్ మేనల్లుడు

చంద్రకాంత్ పాటిల్ బీజేపీ రాష్ట్ర యూనిట్ చీఫ్, కొత్తూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. సుధీర్ మంగంటివార్ రాష్ట్రంలో పార్టీ ప్రముఖ నాయకుల్లో ఒకరు. గత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఇదిలాఉంటే 2019లో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి మారిన విఖే పాటిల్‌కు కూడా కేబినెట్ లో స్థానం కల్పించారు. ఏక్‌నాథ్ షిండే శిబిరం నుండి క్యాబినెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో దాదా భూసే షిండే సహాయకుడు. గతంలో సేన, NCP, కాంగ్రెస్‌ల మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. ఉదయ్ సమంత్ రత్నగిరి నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు.