బీజేపీలో చేరిన సాద్వి ప్రజ్ఞ

  • Edited By: veegamteam , April 17, 2019 / 08:54 AM IST
బీజేపీలో చేరిన సాద్వి ప్రజ్ఞ

మాలెగావ్ పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాద్వి ప్రజ్ఞ ఠాకూర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. బుధవారం (ఏప్రిల్-17, 2019) ఆమె ఆ పార్టీలో చేరారు. భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున దిగ్విజయ్ సింగ్ బరిలో నిలిచారు. 2008 లో జరిగిన మాలెగావ్ పేలుడులో ఆరు మంది మృతి చెందారు. 100 మంది గాయపడ్డారు. ఈ కేసులో సాద్వి ప్రజ్ఞ ఠాకూర్ పై ఆరోపణలున్నాయి. బీజేపీ కాషాయ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని దిగ్విజయ్ సింగ్ తరచుగా ఆరోపణలు చేశారు.