నేనో పెద్ద గాడిదను..ఆ కుటుంబం అసలు రంగును గుర్తించలేకపోయా

సువేందు అధికారి కుటుంబం అసలు రంగును గుర్తించలేకపోయిన తాను ఓ అసమర్థురాలినని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనను తానే నిందించుకున్నారు.

నేనో పెద్ద గాడిదను..ఆ కుటుంబం అసలు రంగును గుర్తించలేకపోయా

Mamata Blames Self For Not Recognising True Face Of Adhikari Family

Mamata సువేందు అధికారి కుటుంబం అసలు రంగును గుర్తించలేకపోయిన తాను ఓ అసమర్థురాలినని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనను తానే నిందించుకున్నారు. ఆదివారం(మార్చి-21,2021)తూర్పు మెదినీపుర్​ జిల్లా కాంతిదక్షిణ్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమత..అధికారం కుటుంబం నిజ స్వ‌రూపాన్ని గుర్తించ‌లేక‌పోయిన ఓ పెద్ద గాడిద‌ను నేను అని అన్నారు. కొన్నాళ్ల కింద‌ట సువేందు అధికారి బీజేపీలో చేర‌గా.. ఆదివారం ఆయ‌న తండ్రి, టీఎంసీ ఎంపీ శిశిర్ అధికారి కూడా కేంద్రహోంమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారి కుటంబసభ్యుల్ని నమ్మక ద్రోహులుగా మమత అభివర్ణించారు.

అధికారి కుటంబం విషయంలో నాదే తప్పు. వారి నిజస్వరూపం తెలుసుకులేకపోయిన నేనో పెద్ద గాడిదని. రూ.5,000 కోట్లు విలువైన ఓ సామ్రాజ్యాన్ని అధికారి కుటుంబం నిర్మించిందనే వదంతులను నేను కూడా విన్నాను. కానీ, నాకు దాని గురించి తెలియదన్నారు. ఆ డబ్బుతో వాళ్లు ఓట్ల‌ను కొంటారు. కానీ మీరు వాళ్ల‌కు ఓట్లు వేయ‌కండి అని మ‌మ‌త ప్రజలకు పిలుపునిచ్చారు. టీఎంసీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే అధికారి కుటుంబ ఆస్తుల‌పై దర్యాప్తు చేయిస్తానని మ‌మ‌త స్ప‌ష్టం చేశారు. జమీందార్ల తరహాలో తూర్పు మెదినీపుర్​ జిల్లా మొత్తాన్ని అధికారి కుటుంబం తమ అధీనంలోకి తెచ్చుకుందని ఆరోపించారు. తనను ఈ ప్రాంతంలో ప్రచారానికి కూడా అనుమతించటం లేదని అన్నారు.

ఇటీవలే తృణమూల్​ను వీడిన భాజపాలో చేరిన సువేందు అధికారి.. నందిగ్రామ్​లో మమతకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారి కుటుంబంపై మమత ఈ విమర్శలు చేశారు.”భాజపా.. రౌడీలు, గుండాల పార్టీ” అని మమత విమర్శించారు. జమీందార్ల తరహాలో జిల్లా మొత్తాన్ని అధికారి కుటుంబం తమ అధీనంలోకి తెచ్చుకుందని ఆరోపించారు. తనను ఈ ప్రాంతంలో ప్రచారానికి కూడా అనుమతించటం లేదని అన్నారు. బీజేపీ.. రౌడీలు, గుండాల పార్టీ అని మమత విమర్శించారు.

ఇక,తృణమూల్​ను వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి.. నందిగ్రామ్​లో మమతకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. మమతను 50వేల ఓట్ల తేడాతో నందిగ్రామ్ లో ఓడిస్తానని ఇప్పటికే సువెందు శపథం చేశారు. మమతను ఓడించకుంటే రాజకీయాలనుంచి తప్పుకుంటానంటూ సువెందు శపథం చేశారు.