ఇంట్లో నిద్రపోతున్న ముగ్గురు దళిత యువతులపై యాసిడ్ అటాక్

ఇంట్లో నిద్రపోతున్న ముగ్గురు దళిత యువతులపై యాసిడ్ అటాక్

ముగ్గురు dalit యువతులు వరుసగా.. 8, 12, 17 సంవత్సరాలు ఉన్న వారిపై acidతో దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో మంగళవారం టాయిలెట్స్ క్లీన్ చేసే లిక్విడ్ తో దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. నిందితుల గురించి పోలీసులు గాలిస్తున్నారు.




ప్రాథమిక విచారణలో తెరచి ఉన్న ఇంటి కిటికీలో నుంచి లిక్విడ్ విసిరినట్లు తెలిసింది. ఈ ఘటనలో వయస్సులో పెద్దదైన యువతికి ముఖంపై, ఛాతికి గాయాలయ్యాయి. మిగిలిన ఇద్దరి చేతులకు చిన్న గాయాలయ్యాయి. వారి ముగ్గురిని గోండా జిల్లా హాస్పిటల్ లో చేర్పించారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.

ఆ ముగ్గురు యువతులు ధోబీ కమ్యూనిటీకి చెందిన వారు.. వారిని షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ కింద పరిగణిస్తారు. లక్నో హెడ్ క్వార్టర్స్ లోని పోలీసు అధికారి డీజీపీ ఈ ఘటన సోమవారం రాత్రి తెల్లవారితే మంగళవారం 2గంటల 30 నిమిషాలకు జరిగినట్లు గుర్తించారు. గదిలో నిద్రపోతుండగా.. ఇంటి సెకండ్ ఫ్లోర్ ఎక్కిన వ్యక్తి అక్కడి నుంచి యాసిడ్ బాటిల్స్ విసిరేసి ఉండొచ్చని భావిస్తున్నారు.




దాడికి పాల్పడిన వాడికి కుటుంబం గురించి పూర్తిగా తెలిసి ఉండొచ్చని.. యువతులు ఆ గదిలో పడుకుంటారని తెలిసే దాడికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఘటనకు కారణమైన నిందితుడ్ని పోలీసులు ఇంకా పట్టుకోలేకపోయారు. ముగ్గురిలో పెద్ద యువతి నిందితుడ్ని పట్టుకోవడంలో సాయం చేస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.