Pigeon Racing Dispute: పావురాల రేసులో హత్య.. జీవిత ఖైదు, లక్ష జరిమానా

పావురాల రేసు విషయంపై జరిగిన వివాదంలో 11ఏళ్ల క్రితం ఓ హత్య జరిగింది. దీనిపై న్యాయ విచారణ జరిపిన లోకల్ కోర్టు.. దోషి సంజయ్‌కు జీవిత ఖైదు విధించడంతో లక్ష జరిమానా విధించింది.

Pigeon Racing Dispute: పావురాల రేసులో హత్య.. జీవిత ఖైదు, లక్ష జరిమానా

Pigeon Racing

Pigeon Racing Dispute: పావురాల రేసు విషయంపై జరిగిన వివాదంలో 11ఏళ్ల క్రితం ఓ హత్య జరిగింది. దీనిపై న్యాయ విచారణ జరిపిన లోకల్ కోర్టు.. దోషి సంజయ్‌కు జీవిత ఖైదు విధించడంతో లక్ష జరిమానా విధించింది. అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ సందీప్ గుప్తా ఆదేశాలిస్తూ ఒకవేళ జరిమానా చెల్లించలేకపోతే మరో రెండేళ్ల పాటు జైలు శిక్ష అదనంగా అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు.

ఈ ఘటనలో మరో నిందితుడైన అమిత్ కుమార్ కేసు ట్రయల్ జరుగుతుండగానే ఇతర కారణాలతో మృతి చెందాడు. ప్రభుత్వం తరపున వాదించిన లాయర్ అమిత్ కుమార్ త్యాగి.. సంజయ్, కుమార్ లు కలిసి సుభాష్ (40)ను నిద్రిస్తుండగానే హత్య చేశారు. 2010 జులై 20న ఈ ఘటన జరిగింది.

బాధితుడు సోదరుడైన రాజీవ్ నిందితులపై కంప్లైంట్ చేయడంతో కేసు ఫైల్ అయి విచారణకు వెళ్లింది. వివాదం ఎందుకు జరిగిందంటే… పావురాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించినందుకు కోపోద్రిక్తులై అతని ఇంటికి వెళ్లి చంపి పావురాన్ని తీసుకురావాలనుకున్నారు. అలా సుభాష్ ప్రాణాలు కోల్పోయాడు.

……………………………: ఈ వారం OTTల్లో వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!