King Cobra : OMG.. ప్రాణాలను పణంగా పెట్టి భారీ కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

King Cobra: ఆ పాము చాలా పొడవుగా ఉంది. పైగా విషపూరితమైన సర్పం. కాటేసిందా? ఇక అంతే. స్పాట్ లోనే చావు ఖాయం. అయినా ఆ స్నేక్ క్యాచర్ భయపడలేదు.

King Cobra : OMG.. ప్రాణాలను పణంగా పెట్టి భారీ కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

King Cobra(Photo : Google)

King Cobra : సాధారణంగా చిన్న సైజులో ఉన్న పాముని దూరం నుంచి చూస్తేనే మనకు గుండె జారిపోతుంది. ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. భయంతో బీపీ పెరిగిపోతుంది. కాళ్లు చేతులు ఆడవు. అలాంటిది భారీ పాము కనిపిస్తే? విషపూరితమైన కింగ్ కోబ్రా కంటపడితే? అమ్మో.. ఇంకేముంది పైప్రాణాలు పైనేపోతాయి అంటారు కదూ. కానీ, ఆ స్నేక్ క్యాచర్ భయపడేలేదు. కళ్ల ముందు భారీ కింగ్ కోబ్రా పడగ విప్పి బుసలు మీద బుసలు కొడుతున్నా అదరలేదు, బెదరలేదు. ఎంతో ఓర్పుగా, నేర్పుగా భారీ విషసర్పాన్ని ఇట్టే పట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అది గోవాలోని ప్రాంతం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ సడెన్ గా భారీ కింగ్ కోబ్రా ఒకటి జనాల మధ్యలోకి వచ్చింది. అసలే కింగ్ కోబ్రా. చాలా పొడవుగా ఉంది. అత్యంత విషపూరితమైనది. బుసలు కొడుతోంది. అంతే, ఆ పాముని చూసినోళ్లకు అక్కడే గుండెలు జారిపోయాయి. ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ పాముని బంధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.(King Cobra)

ఆ పాము చాలా పొడవుగా ఉంది. పైగా విషపూరితమైన సర్పం. కాటేసిందా? ఇక అంతే. స్పాట్ లోనే చావు ఖాయం. అయినా ఆ స్నేక్ క్యాచర్ భయపడలేదు. తన ప్రాణాలను పణంగా పెట్టి దాన్ని పట్టే ప్రయత్నం చేశాడు. నిజానికి పాములను పట్టడం అంత సులువు కాదు. అందులోనూ విషపూరిత పాములను పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

Also Read..Parveen Kaswan, IFS : ప్రాణాపాయంలో ఉన్న జింకకు ఆక్సిజన్ అందించిన వ్యక్తి.. IFS ఆఫీసర్ పోస్ట్ చేసిన ఫోటో వైరల్

స్నేక్ క్యాచర్ భారీ కింగ్ కోబ్రాను చాలా నేర్పుగా బంధించేశాడు. ఆ పాము అక్కడే ఉన్న పొదల్లోకి దూరాలని చాలా ప్రయత్నించింది. కానీ, పాముని స్నేక్ క్యాచర్ వదల్లేదు. ఎంతో ధైర్యంగా దాన్ని తోక పట్టుకుని బయటకు లాగాడు. ఇలా పలుమార్లు దాని తోక పట్టి బయటకు లాగాడు. ఇక, దాన్ని బంధించే క్రమంలో ఆ పాము పలు మార్లు కాటేయాలని చూసింది. అయితే, ఎంతో అలర్ట్ గా ఉన్న అతడు వెంటనే తప్పించుకున్నాడు. చివరికి దాన్ని బంధించడంలో అతడు సక్సెస్ అయ్యాడు. పాముని పట్టేందుకు అక్కడ ముందుగానే పొడవాటి బ్యాగుని సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఆ పాము అందులోకి దూరేవరకు అతడు నిద్రపోలేదు. చివరికి.. కింగ్ కోబ్రా ఆ స్నేక్ క్యాచర్ పోరాటం ముందు తలవంచక తప్పలేదు. పాము బ్యాగులోకి దూరేలా చేసి దాన్ని బంధించగలిగాడు. ఆ తర్వాత భారీ సర్పాన్ని అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు. దాంతో అక్కడున్న వారంతా హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. స్నేక్ క్యాచర్ ఎంతో కష్టపడి ఎంతో నేర్పుగా భారీ సర్పాన్ని బంధించిన వైనం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(King Cobra)

ఆ స్నేక్ క్యాచర్ తన ప్రాణాలను పణంగా పెట్టి పాముని బంధించాడని, అతడి గట్స్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. భయ్యా నీ ధైర్యానికి సెల్యూట్ అంటున్నారు. ఈ వీడియోను కమాండర్ అశోక్ బిజల్వాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read..intelligent parrot : ఇది మామూలు రామచిలుక కాదు.. తెలంగాణ ఐపీఎస్ అధికారి పోస్ట్ చేసిన రామచిలుక క్యూట్ వీడియో

రోమాలు నిక్కబొడిచేలా, ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రాణాలను పణంగా పెట్టి భారీ సర్పాన్ని బంధించిన స్నేక్ క్యాచర్ ధైర్యసాహసాలను అంతా మెచ్చుకుంటున్నారు.