intelligent parrot : ఇది మామూలు రామచిలుక కాదు.. తెలంగాణ ఐపీఎస్ అధికారి పోస్ట్ చేసిన రామచిలుక క్యూట్ వీడియో

మనం ఒక్కోసారి ఆ పని రాదు.. ఈ పని రాదు అంటాం. నిజానికి ఆ పని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేర్చుకుని అయినా చేస్తాం.. రామచిలుక కొబ్బరి బొండాం వొలిచి నీరు త్రాగగలదా? రామచిలుక.. కొబ్బరిబొండమా? ఆశ్చర్యంగా ఉంది కదా.. చదవండి.

intelligent parrot : ఇది మామూలు రామచిలుక కాదు.. తెలంగాణ ఐపీఎస్ అధికారి పోస్ట్ చేసిన రామచిలుక క్యూట్ వీడియో

intelligent parrot

intelligent parrot :  అవసరం మనకి ఎలాంటి పనుల్ని అయినా నేర్పిస్తుంది. తెలంగాణ ఐపీఎస్ అధికారి రమేష్ మస్తిపురంగారు ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ చూసి మీరు ఖచ్చితంగా నిజమని అంటారు. ఇంతకీ ఆయన ఏం పోస్ట్ చేసారు.. ?

Viral wedding : బాజా భజంత్రీలతో మైనా – చిలుకలమ్మల పెళ్లి.. ఘనంగా బరాత్‌

ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. మనుష్యులే కాదు మూగజీవాలు ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నాయి. పక్షుల సంగతీ మరీనూ. వీటికోసం చాలామంది ఇళ్ల దగ్గర గూళ్లు, మంచినీరు అందించే ఏర్పాట్లు చేస్తుంటారు. ఇక విషయానికి వస్తే ఓ రామచిలుక ఎండలో బాగా తిరిగి అలసిపోయి ఓ కొబ్బరి చెట్టుపై వాలింది. బాగా దాహం వేస్తోంది. ఎదురుగా కొబ్బరి బొండాలు కనిపిస్తున్నాయి. అది కొబ్బరి బొండాం కోసి తాగుతుందని ఎవరైనా ఊహించగలరా? కానీ అది అదే పని చేసింది. చక్కగా లేతగా ఉన్న కొబ్బరి బొండాం ముక్కుతో ఒలుచుకుని అచ్చంగా మనుష్యులు తాగినట్లు బొండాం ఎత్తిపెట్టుకుని మొత్తం నీటికి తాగేసింది. ఈ వీడియో చూసిన వారు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు.

Parrot Steals Reporter’s Earphone : దోపిడీ గురించి రిపోర్టు చేస్తుండగా.. జర్నలిస్టు ఇయర్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన చిలుక

ఈ వీడియోని తెలంగాణ ఐపీఎస్ అధికారి రమేష్ మస్తిపురం గారు ‘అవసరం నేర్పున్ సకల విద్యలున్’ అనే ట్యాగ్ తో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు గ్రేట్ అని.. బ్రతుకుపోరాటం అని అబిప్రాయాలు చెబుతున్నారు. రామచిలుక నేను ఈ పని చేయగలనా? అని ఆగిపోకుండా తన అవసరానికి కొబ్బరి బొండాం ఒలుచుకుని హాయిగా నీరు తాగేసింది. మనుష్యులు కూడా అది చేత కాదు.. ఇది చేత కాదు అని కాకుండా ఏదైనా సాధించగలం అనే స్ఫూర్తితో ముందుకుపోవాలి.. ఈ కథలోని రామచిలుకలాగ అన్నమాట.