Bengaluru : అతను చాట్ చేస్తున్నది ఎవరితోనో తెలిసి షాకయ్యాడు

వాట్సాప్ గ్రూపులో ఓ సాయం కోరుతూ మెసేజ్ పెట్టిన వ్యక్తి ర్యాపిడో ఫౌండర్ అని తెలిసి ఆ యువకుడు షాకయ్యాడు. ఇంతకీ ర్యాపిడో ఫౌండర్ అని అతనికి ఎలా తెలిసింది?

Bengaluru : అతను చాట్ చేస్తున్నది ఎవరితోనో తెలిసి షాకయ్యాడు

Bengaluru

Bengaluru :  కొందరు ప్రముఖులు మన పక్కన ఉన్నా.. మన ఇంటి ఎదురుగా ఉన్నా ఒక్కోసారి గుర్తించలేకపోతాం. తీరా తెలిసాక.. అవునా? అని ఆశ్చర్యపోతాం. లింక్డ్‌ఇన్ సభ్యుడైన ఆకాష్‌లాల్ బాతే తమ ఏరియా వాట్సాప్ గ్రూప్‌లో తను చాట్ చేసింది ర్యాపిడో సహ వ్యవస్థాపకుడితో అని తెలిసి ఆశ్చర్యపోయాడు.

TSRTC MD Sajjanar : అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ క్షమాపణలు చెప్పాలి
బెంగళూరుకి చెందిన సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ఆకాష్‌లాల్ బాతేకి తన ఏరియాకి సంబంధించి వాట్సాప్ గ్రూపులో “నిచ్చెన కావాలంటూ” వచ్చిన రిక్వెస్ట్ చూసాడు. నిచ్చెన అడిగిన వ్యక్తిని ఆకాష్ “మీరు ఏం చేస్తుంటారు?” అని ప్రశ్నించాడు. “ఇంట్లో ఏసీ బిగించడానికి నిచ్చెన కావాలని” అతను సమాధానం ఇచ్చాడు. అందుకు ఆకాష్ “కాదు.. మీరు ఫోటోగ్రఫీ చేస్తారా? మీ డీపీ చూస్తే అలా అనిపించింది”.. అంటూనే ర్యాపిడోతో మీకేం పని?”అని ప్రశ్నించాడు.

“నేను ర్యాపిడో ఫౌండర్‌ని” అని అవతలి వ్యక్తి చెప్పిన ఆన్సర్ విని ఆకాష్ షాకయ్యాడు. గూగుల్‌కి వెళ్లి నైబర్ వివరాలు కనుక్కుంటే అతను నిజంగానే ర్యాపిడో ఫౌండర్ అని తెలిసింది. తనతో చేసిన చాట్‌ను లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేస్తానని ఆకాష్ లాల్ అతనిని రిక్వెస్ట్ చేశాడు.

High Court: రాపిడోకు హైకోర్టు షాక్.. అల్లూ అర్జున్ ప్రకటనలో కత్తిరింపులు

ఆకాష్ అతని వ్యాపారాన్ని మెచ్చుకోవడమే కాకుండా చాలాసార్లు తనకి ఉపయోగపడిందని చెప్పాడు. ఆకాష్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసిన వీరి వాట్సాప్ సంభాషణ వైరల్ అవుతోంది. అయితే ర్యాపిడో ఫౌండర్ నేమ్ మాత్రం ఆకాష్ పోస్ట్‌లో వెల్లడించలేదు.  2015లో బైక్ ట్యాక్సీల వేదికగా అరవింద్ సంక, పవన్ గుంటుపల్లి, SR రిషికేష్ లు ర్యాపిడోని స్ధాపించారు.