Uttar Pradesh: ఎలుక తోకకు రాయికట్టి, డ్రైనేజీలో వేసి చంపిన వ్యక్తి.. మూడేళ్లు శిక్షపడే ఛాన్స్

ఓ ఎలుకను పట్టుకున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి దాని తోకకు రాయి కట్టాడు. అనంతరం డ్రైనేజీలో వేశాడు. ఎలుక పోస్టుమార్టం రిపోర్టులు వచ్చాయి.

Uttar Pradesh: ఎలుక తోకకు రాయికట్టి, డ్రైనేజీలో వేసి చంపిన వ్యక్తి.. మూడేళ్లు శిక్షపడే ఛాన్స్

Uttar Pradesh

Uttar Pradesh: ఓ ఎలుకను డ్రైనేజీలో వేసి చంపిన ఓ వ్యక్తి మూడేళ్ల పాటు జైలుకు వెళ్లే ముప్పును కొనితెచ్చుకున్నాడు. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసు ఎదుర్కొంటున్నాడు. ఎలుక పోస్టుమార్టం రిపోర్టు సహా ఇతర ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. 30 పేజీల ఛార్టిషీటును బదాయూ కోర్టులో దాఖలు చేశారు.

ఓ ఎలుకను పట్టుకున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి దాని తోకకు రాయి కట్టాడు. అనంతరం డ్రైనేజీలో వేశాడు. గత ఏడాది నవంబరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన జంతు హక్కుల పరిపరక్ష కార్యకర్త వికేంద్ర శర్మ ఫిర్యాదు చేశారు. ఎలుకను రక్షించడానికి తాను డ్రైనేజీలోకి దిగానని, అప్పటికే అది చనిపోయిందని వికేంద్ర శర్మ తెలిపారు. అనంతరం జంతు ప్రేమికులను వెంట బెట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి మనోజ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు మనోజ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎలుక కాలేయం, ఊపిరితిత్తులు కూడా పాడైపోయాయని పోస్టు మార్టంలో తేలింది. డ్రైనేజీలో మునిగినందుకు కాకుండా, అందులో ఊపిరి ఆడక ఆ ఎలుకచనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేయగా, అతడు బెయిల్ పై ఉన్నాడు. అతడికి మూడేళ్ల జైలు శిక్ష పడే ప్రమాదము ఉందని నిపుణులు చెబుతున్నారు.

Honey Rose: హనీ మనోభావాలను దెబ్బతీస్తున్నారా.. ఒక్కటి కూడా లేదే..?