Man Sold daughter-in-law: కోడలిని రూ.80వేలకు అమ్మేసిన మామ.. 8మంది అరెస్ట్!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కోడలిని అమ్మేశాడు ఓ మామ. రూ.80 వేలకు గుజరాత్‌కు చెందిన ముఠాతో ఒప్పందం చేసుకోగా.. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని కాపాడి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.

Man Sold daughter-in-law: కోడలిని రూ.80వేలకు అమ్మేసిన మామ.. 8మంది అరెస్ట్!

Man Sold Daughter In Law

Man Sold daughter-in-law: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కోడలిని అమ్మేశాడు ఓ మామ. రూ.80 వేలకు గుజరాత్‌కు చెందిన ముఠాతో ఒప్పందం చేసుకోగా.. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని కాపాడి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారబంకీ జిల్లా మల్లాపుర్‌ గ్రామానికి చెందిన వాడీ ప్రిన్స్ వర్మ అనే వ్యక్తి తన భార్యను తండ్రి తండ్రి చంద్రవర్మ గౌతమ్ అనే వ్యక్తితో కలిసి అమ్మేస్తున్నాడంటూ మహిళా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గుజరాత్‌కు చెందిన షాహిల్ పాంచా అనే వ్యక్తి రూ.80 వేలకు కొనుగోలు చేసినట్లు గుర్తించి బాధితురాలిని రక్షించారు. ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేయగా.. బాధితురాలిని భర్తకు అప్పగించారు పోలీసులు. అరెస్టు చేసిన ఎనిమిది మంది నిందితులలో ముగ్గురు మహిళలు ఉండగా.. ప్రధాన నిందితుడు బాధితురాలి మామ చంద్ర వర్మ‌, గ్రామానికి చెందిన వ్యక్తి రాము గౌతమ్‌లు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తుండగా.. చంద్ర వర్మ ఎంతోమంది అమ్మాయిలను ఇలా అమ్మే ప్రయత్నం చేసినట్లుగా స్థానిక ఎస్‌పీ యమున ప్రసాద్ చెప్పారు. ఇప్పటివరకు 300 మంది మహిళలను అమ్మేసినట్లు పోలీసులకు చెప్పారు.

చంద్రవర్మపై ఓ హత్యకేసు కూడా ఉందని, ఈ కేసులపై విచారణకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎనిమిది మంది నిందితులు సాహిల్ పంచా, పప్పు భాయ్ శర్మ, అపుర్వ పంచా, గీతా బెన్, నీతా బెన్, శిల్పా బెన్, రాకేశ్, అజయ్ భాయ్ పంచలను అదుపులోకి తీసుకోగా.. వారు గుజరాత్‌కు చెందిన ఉమేదా జిల్లా వాసులుగా గుర్తించారు.