Police Chase: సినీ ఫక్కీలో పోలీస్ రియల్ ఛేజింగ్.. వైరల్ వీడియో!
సినిమాల్లో దొంగలను ఛేజ్ చేసి పోలీసులు పట్టుకోవడం చూస్తూనే ఉంటాం..
Police Chase: సినిమాల్లో దొంగలను ఛేజ్ చేసి పోలీసులు పట్టుకోవడం చూస్తూనే ఉంటాం.. రియల్ లైఫ్లో అటువంటివి కనబడవు.. కానీ, లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ దొంగను పోలీస్ చేజ్ చేసి పట్టుకుని పెడరెక్కలు విరిచి ధైర్యంగా ఓక్కడే పట్టుకున్న దృశ్యం ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.
కర్నాటకలోని మంగళూరులో ఓ దొంగ మహిళ నుంచి ఫోన్ కొట్టేసి పారిపోతుండగా.. బాధితురాలు దొంగ.. దొంగ అంటూ పెద్దగా అరిచింది. ఆమె కేకలు విన్న ఓ అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వరుణ్ దొంగను వెంబడించి పట్టుకుని కింద పడేసి పెడరెక్కలు విరిచి సినీ ఫక్కీలో పట్టుకున్నారు. కాగా పోలీసు అధికారి దొంగను పట్టుకున్న సంధర్భాన్ని ఎవరో కెమెరాలో బంధించారు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ పోలీసు అధికారిని ప్రతీఒక్కరూ అభినందిస్తున్నారు. వెంటనే స్పందించే గుణమున్న పోలీసులు ఉండడం గ్రేట్ అంటున్నారు. దొంగను పట్టుకున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ను మంగళూరు కమిషనర్ ఎన్ శశికుమార్ కూడా ప్రశంసించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
#Karnataka #WATCH #Mangaluru Assistant Police Sub-Inspector Varun chase and nab a robber who had snatched away mobile phone from a man who was resting. @IndianExpress @DarshanDevaiahB pic.twitter.com/SbXlFTcMJM
— Kiran Parashar (@KiranParashar21) January 13, 2022