Assembly Elections 2023: ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి వస్తున్న ఎస్సీ, ఎస్టీ బ్యూరోక్రాట్లు.. పోటీ పడుతున్న బీజేపీ, కాంగ్రెస్

ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన బ్యూరోక్రాట్లను కాంగ్రెస్ మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇచ్చేందుకు పోటీ పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చిన బ్యూరోక్రాట్లను రెండు గిరిజన స్థానాల్లో భారతీయ జనతా పార్టీ రంగంలోకి దించింది

Assembly Elections 2023: ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి వస్తున్న ఎస్సీ, ఎస్టీ బ్యూరోక్రాట్లు.. పోటీ పడుతున్న బీజేపీ, కాంగ్రెస్

Assembly Elections 2023: రాజకీయ రంగం రాను రాను మరింత ప్రధాన్యత, ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. గతంలో మిగిలిన రంగాల వారు రాజకీయాల్ని అంతగా పట్టించుకునే వారు కాదు. కానీ నేడు వారు ఏ రంగంలో ఉన్నా సరే.. రాజకీయంలో కూడా రాణించాలని అనుకుంటున్నారు. అవసరమైతే ఇప్పుడు తమకున్న రంగాల్లో ఆ స్థానాన్ని వదులుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇందులో ప్రముఖంగా బ్యూరోక్రాట్లను చెప్పుకోవచ్చు. తెలుగు నేలపై ప్రస్తుతం జయప్రకాశ్ నారాయణ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జేడీ లక్ష్మీ నారాయణ లాంటి వారు ఉన్నారు. కాగా, తెలంగాణతో పాటు ఎన్నికలు జరుపుకునే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ట్రెండ్ పెద్ద ఎత్తున కనిపిస్తోంది.

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు వదిలలుకుని రాజకీయాల్లోకి వస్తున్న దళిత, గిరిజనుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చిన పదిమందికి పైగా అధికారులు ఈసారి అసెంబ్లీ టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. చాలా మంది పోటీదారులకు బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. ఎన్నికల బరిలోకి దిగేందుకు ఇంకా చాలా మంది పోటీదారులు కష్టపడుతున్నారు. వీరిలో నిషా బంగ్రే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బాంగ్రే ప్రస్తుతం ప్రభుత్వ అధికారి, అయితే బెతుల్‌లోని ఆమ్లా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ కూడా ఆమెకు టిక్కెట్టు ఇస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: హమాస్‭కు మద్దతిచ్చే వారికి సీఎం యోగి హెచ్చరికలు.. సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు

ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన బ్యూరోక్రాట్లను కాంగ్రెస్ మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇచ్చేందుకు పోటీ పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చిన బ్యూరోక్రాట్లను రెండు గిరిజన స్థానాల్లో భారతీయ జనతా పార్టీ రంగంలోకి దించింది. మరో ఐదుగురు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో దళిత, గిరిజన సీట్లపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగులను పోటీకి దింపుతున్న తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2007 డీలిమిటేషన్ ప్రకారం, మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 35 దళితులకు, 42 గిరిజనులకు రిజర్వు చేశారు. బర్వానీ, మాండ్లా, షాహ్‌దోల్, దిండోరి, ఝబువా వంటి జిల్లాల్లో అత్యధిక స్థానాలు గిరిజనులకు కేటాయించారు.

ఇది కూడా చదవండి: Ponnala Lakshmaiah : పదవుల కోసం కాదు అవమానాలు భరించలేకే రాజీనామా చేశా : పొన్నాల లక్ష్మయ్య

2018లో దళితులు, గిరిజనులకు రిజర్వ్ చేసిన 82 స్థానాల్లో కాంగ్రెస్ 47 గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ 34 సీట్లు గెలుచుకుంది. దళితుల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉండగా, గిరిజనుల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో నిలిచింది. ఈసారి కూడా ఈ సీట్లపై ఇరు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే గోండ్వానా గణతంత్ర పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు తాజాగా పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు దళిత, గిరిజన సీట్లను గెలుచుకునేందుకు కూటమిగా ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో దాదాపు 20 గిరిజన స్థానాల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల ఆటను గోండ్వానా గంటంత్ర పార్టీ చెడగొట్టింది. కాగా, ఈ ఎన్నికల్లో బీఎస్పీ-జీజీపీ కూటమి మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.