Mayawati: కీర్తికి తగ్గట్టుగా సమాధానం చెప్పారు.. భారత సైన్యానికి మాయావతి ప్రశంసలు

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైన్యాల మధ్య జరిగిన రక్తపాత ఘర్షణ, అందులో పలువురు సైనికులు గాయపడిన వార్త పట్ల చాలా బాధగానూ, ఆందోళనగానూ ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచాన్ని చాలా బాధిస్తున్నాయి. ఈ తరుణంలో భారత్-చైనా సైన్యం మధ్య కొత్త వివాదం మరింత ముందుకు పోకుండా దౌత్య మార్గాల ద్వారా వెంటనే పరిష్కారం చూపించుకోవాల్సిన అవసరం ఉంది

Mayawati: కీర్తికి తగ్గట్టుగా సమాధానం చెప్పారు.. భారత సైన్యానికి మాయావతి ప్రశంసలు

Mayawati lauds army for befitting reply to China in Tawang

Mayawati: అరుణాచల్ ప్రదేశ్‭లోని తవాంగ్ ప్రాంతంలో ఈ నెల 9న చైనా సైనికులు చొరబాటు యత్నించడం, దాన్ని భారత సైన్యం తిప్పి కొట్టడంపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి హర్షం వ్యక్తం చేశారు. భారత సైన్యం తన కీర్తికి తగ్గట్టుగా మరోసారి వ్యవహరించందంటూ ఆమె ప్రశంసలు కురిపించారు. ఇరు దేశాల సైనికుల ఘర్షణలో కొందరు సైనికులు గాయపడటం పట్ల తాను ఆందోళన చెందినట్లు, బాధపడినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఘర్షణపై మాయావతి ఆందోళన వ్యక్తంచేశారు.

Singapore: కాఫీ, మిల్క్ షేక్ అమ్మడం కూడా నేరమే.. అలా చేసినందుకు జైలుపాలైన ఓ వ్యక్తి

‘‘అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైన్యాల మధ్య జరిగిన రక్తపాత ఘర్షణ, అందులో పలువురు సైనికులు గాయపడిన వార్త పట్ల చాలా బాధగానూ, ఆందోళనగానూ ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచాన్ని చాలా బాధిస్తున్నాయి. ఈ తరుణంలో భారత్-చైనా సైన్యం మధ్య కొత్త వివాదం మరింత ముందుకు పోకుండా దౌత్య మార్గాల ద్వారా వెంటనే పరిష్కారం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా చైనా విషయంలో భారత సైన్యం తన కీర్తికి తగ్గట్టుగానే మరోసారి తగిన సమాధానం ఇవ్వడం అభినందనీయం. ఇప్పుడు తమ దౌత్య నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దేశం ఆశించేది అదే. మన ఇంటెలిజెన్స్‌ను మరింత బలోపేతం చేసుకోవాలి’’ అని ట్వీట్ చేశారు.

Joe Biden: స్వలింగ వివాహాలకు బైడెన్ ఆమోదముద్ర.. అమెరికాలో అమల్లోకి రానున్న కొత్త చట్టం

డిసెంబ‌ర్ 9వ తేదీన త‌వాంగ్ సెక్టార్ వ‌ద్ద చైనా బ‌ల‌గాలు ఎల్ఏసీ దాటి భార‌త భూభాగంలోకి వ‌చ్చినందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా పార్లమెంట్ లో వెల్లడించారు. చైనా సైనికులను భారత్ సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారని వెల్లడించారు. ఘ‌ర్ష‌ణ రోజున ఇరు వ‌ర్గాల ద‌ళాల‌కు స్వ‌ల్ప స్థాయిలో గాయాలైన‌ట్లు తెలుస్తోంది. కానీ మంత్రి మాత్రం భారత సైనికులకు ఎటువంటి గాయాలు అవ్వలేదని తెలిపారు.