McDonald’s : మెక్ డొనాల్డ్స్ కూల్ డ్రింకులో చచ్చిన బల్లి…అవుట్ లెట్ మూసివేత

అహ్మదాబాద్ లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో కోక్ తాగుతుండగా..అందులో భార్గవ జోషి అనే వ్యక్తి తాగుతున్న కూల్ డ్రింకులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది.

McDonald’s  : మెక్ డొనాల్డ్స్ కూల్ డ్రింకులో చచ్చిన బల్లి…అవుట్ లెట్ మూసివేత

Mcdonald’s

McDonald’s : బతికున్న బల్లిని అంత దూరాన చూస్తేనే హడలిపోతారు చాలామంది. అటువంటిది చచ్చిన బల్లి మన తాగే నీళ్లలోను..తినే ఆహారంలోనో కనిపిస్తే..ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటానికి ఎలపరం వచ్చేస్తుంది. వాంతి వచ్చేస్తుంది. అదే ఓ హోటల్ లోనో..రెస్టారెంట్ లోనే తాగే కూల్ డ్రింక్ లో కనిపిస్తే..అదే జరిగింది ఓ కష్టమర్ కు. అహ్మదాబాద్ లోని ఓ మెక్ డానాల్డ్స్ రెస్టారెంట్ లో ఓ కస్టమర్ తాగే కూల్ డ్రింగ్ లో చచ్చిన బల్లి కనిపించింది..ఈ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లితే హా..ఏముంది లైట్ తీస్కోండి మీ డబ్బులు మీకిచ్చేస్తాం అంటూ కూల్ గా ఓ ఆఫర్ ఇచ్చారు. సిబ్బంది మాట్లాడిన తీరు నచ్చని సదరు కష్టమర్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రెస్టారెంట్ అవుట్ లెట్ ను అధికారులు మూసివేయించారు.

అహ్మదాబాద్ లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో కోక్ తాగుతుండగా..అందులో భార్గవ జోషి అనే వ్యక్తి తాగుతున్న కూల్ డ్రింకులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. దీనిని వీడియో తీసిన భార్గవ జోషి పోలీసులకు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) అధికారులకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

కూల్ డ్రింకులో చచ్చిన బల్లి పడివున్న విషయాన్ని మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ మేనేబజర్ దృష్టికి తీసుకెళ్లగా..అదేం పెద్ద విషయం కాదులే..మీ డబ్బులు మీకిచ్చేస్తాం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని భార్గవ ఆరోపించాడు. దీంతో భార్గవ్ ఈ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) అధికారులకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

కూల్ డ్రింకులో బల్లి పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అహ్మదాబాద్ పురపాలక శాఖ వెంటనే స్పందించింది. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ లో తనిఖీలు చేపట్టింది. ఆపై రెస్టారెంటును మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కూల్ డ్రింకు శాంపిల్స్ ను పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి పంపించారు.