Prayagraj: అతీక్ అహ్మద్ మర్డర్ కేసులో సీన్ రీక్రియేట్ చేసిన జ్యూడీషియల్ కమిషన్

అతీక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ లను పోలీసులు తీసుకుని రావడం, వారితో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించడం, ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరపడం, వారిని పోలీసులు పట్టుకోవడం, తదితరాలను రీ క్రియేట్ చేశారు.

Prayagraj: అతీక్ అహ్మద్ మర్డర్ కేసులో సీన్ రీక్రియేట్ చేసిన జ్యూడీషియల్ కమిషన్

Prayagraj: మాజీ ఎంపీ, గ్యాంగ్‭స్టర్ అతీక్ అహ్మద్ సహా అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‭ను గతవారం పోలీసుల కస్టడీలోనే మీడియా ముందు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా జ్యూడీషియల్ కమిషన్ గురువారం ‘సీన్ రీక్రియేట్’ చేసింది. అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ సహా పోలీసులు, మీడియా వేషధారణలో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‭రాజ్‭లో హత్య జరిగిన ప్రాంతంలోనే జరిగిన తంతును మరోసారి పునర్ణిర్మానం చేసే ప్రయత్నం చేశారు.


జ్యుడీషియల్ కమిషన్, ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో, భారీ బందోబస్తు మధ్య ఇది నిర్వహించారు. అతీక్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ లను పోలీసులు తీసుకుని రావడం, వారితో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించడం, ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరపడం, వారిని పోలీసులు పట్టుకోవడం, తదితరాలను రీ క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.