మైక్రోసాఫ్ట్ చేతుల మీదుగా Covid-19 వ్యాక్సిన్ పంపిణీ

మైక్రోసాఫ్ట్ చేతుల మీదుగా Covid-19 వ్యాక్సిన్ పంపిణీ

Covid-19 vaccine: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. మైక్రోసాఫ్ట్ వేదికగా వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్‌ జరిగి గవర్నమెంట్, హెల్త్ కేర్ కస్టమర్లకు పంపిణీ జరగనుంది. మైక్రోసాఫ్ట్ పార్టనర్స్ Accenture, Avanade, EY, Mazik Global ఇందులో భాగం కానున్నారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసెస్ సహాయంతో వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ పూర్తి చేయాలనుకుంటున్నారు.

కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ సమర్థవంతంగా, సమానంగా, సేఫ్‌గా అందజేయడానికి ఏజెన్సీలతో సమన్వయం కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా పార్టనర్లు కీలకంగా వ్యవహరిస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. అని మైక్రోసాఫ్ట్ శుక్రవారం ఓ స్టేట్‌మెంట్‌లో చెప్పింది. ప్రతి గవర్నమెంట్, హెల్త్‌కేర్ కస్టమర్ అవసరాన్ని తీర్చే విధంగా సర్వీస్ అందజేస్తామని మైక్రోసాఫ్ట్ హామీ ఇస్తుంది.

మైక్రోసాఫ్ట్ పార్టనర్లు కస్టమర్లతో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ సరైన పద్ధతిలో నిర్వహించనుంది. పేషెంట్లకు, ప్రొవైడర్లకు, వ్యాక్సినేషన్ ను షెడ్యూల్ విధానంలో అందజేస్తారు. ముందుచూపుతో అత్యవసరంగా ఎవరికి కావాలో విశ్లేషించి వారికి అందజేస్తారు.

మైక్రోసాఫ్ట్.. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లతో కలిసి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ డెలివరీ అనేది వీలైనంత త్వరగా జరగాలని సపోర్ట్ చేస్తున్నాయి. అదే సమయంలో సెక్యూర్‌గా, సమానత్వంతో పంపిణీ జరుగుతుందని మైక్రోసాఫ్ట్ వరల్డ్ వైడ్ కమర్షియల్ బిజినెస్, వీపీ హెల్త్ కేర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డేవిడ్ షా అంటున్నారు.

మైక్రోసాఫ్ట్ కన్సల్టింగ్ సర్వీసెస్(ఎమ్సీఎస్) 230కి పైగా ఎమర్జన్సీ కొవిడ్-19 రెస్పాన్స్ మిషన్లను ప్రపంచవ్యాప్తంగా మొదలుపెట్టాయి. హెల్త్ ప్రొవైడర్లు, ఫార్మసీలు ప్రత్యేకమైన వ్యాక్సిన్ బ్యాచ్‌ను మానిటర్ చేస్తూ.. ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ ను అందరికీ పంపిణి చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నాయని కంపెనీ చెప్పింది.