వలస కష్టం : సొంత ఊరు వెళ్లటానికి భార్య మంగళసూత్రం అమ్మి సైకిలు కొన్న వలసకూలీ

  • Published By: nagamani ,Published On : June 4, 2020 / 09:06 AM IST
వలస కష్టం : సొంత ఊరు వెళ్లటానికి భార్య మంగళసూత్రం అమ్మి సైకిలు కొన్న వలసకూలీ

వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. సొంత ఊరు చేరుకుందామని బయలుదేరిన బడుగు జీవుల కష్టాల గాథలు విషాదగాథలుగా మారిపోయాయి. అలాగే లాక్ డౌన్ కష్టాల్లో సొంత ఊర్లకు చేరుకుందామనే తపనలో భాగంగా కష్టాలకు ఓర్చుకుంటూ పయనమైనవారి ప్రతిభలు కూడా వెలుగులు లోకి వచ్చాయి.   

ఈ క్రమంలో ఒడిశా నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు పొట్ట చేత పట్టుకునివచ్చిన చందన్ జెన్ కుటుంబం ఒకటి. లాక్ డౌన్ తో తిరిగి తన సొంత రాష్ట్రంలోని తన ఊరుకు వెళ్లిపోదామనుకున్నాడు. భార్య, స్నేహితుడు తపాన్ జెనాలతో కలిసి నివశించే చందన్ జెన్ కరోనా లాక్ డౌన్ తో కూలీ పనులు దొరక్క అల్లాడిపోయాడు.

అలా లాక్ డౌన్ ప్రారంభం నుంచి పనులు లేకుండా పోవటంతో కడుపునిండా తినటానికి తిండి కూడా దొరక్క ఆకలితోనే కాలం గడిపాడు. ఇటువంటి దుర్భర స్థితిలో ఉండే కంటూ ఉన్న కలోగంజో తాగుతూ సొంత ఊరిలో ఉంటే చాలు అనుకుని వెళ్లిపోదామని అనుకున్నాడు. కానీ చేతిలో చిల్లిగవ్వలేదు. 

దీంతో తన భార్య మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుల్లోని రూ.5వేలతో రెండు సైకిళ్లు కొన్నాడు. ఆ రెండు సైకిళ్లపై చందన్ జెన్, అతని భార్య, స్నేహితుడు కలిసి ఒడిశాకు పయనమయ్యారు. ఒడిశాలోని భద్రక్ జిల్లా బాసుదేవపూర్ గ్రామానికి చెందిన చందన్ తన గ్రామానికి వెళ్లేందుకు సైకిళ్లపై ముగ్గురూ బెంగళూరు నుంచి కటక్ నగరానికి చేరుకున్నారు. కటక్ నగరంలో కొందరు సామాజిక వేత్తలు చందన్ వలస కథ తెలుసుకొని చలించిపోయారు.  ఆవేదన చెందారు.తరువాత వారికి తపన్ జెనాలకు భోజనం పెట్టి వాటర్ బాటిళ్లు ఇచ్చి వారి స్వగ్రామానికి వ్యానులో పంపించారు. 

Read: భారత రక్షణశాఖ కార్యాలయంలో కరోనా కలకలం, ఉన్నతాధికారికి కొవిడ్