మా ఊరు వెళ్లిపోతాం అని అడిగిన వలస కూలీలను చితక్కొట్టిన కాంట్రాక్టర్

  • Published By: nagamani ,Published On : May 16, 2020 / 12:03 PM IST
మా ఊరు వెళ్లిపోతాం అని అడిగిన వలస కూలీలను చితక్కొట్టిన కాంట్రాక్టర్

రాజస్థాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్‌ వలస కూలీలపై దారుణంగా దాడిచేశారు. మా ఊళ్లకు వెళ్లిపోతాం సార్..అని అన్న పాపానికి వారిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. ఈ దాడిలో పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది తలకు తీవ్రగాయాలుఅయ్యాయి. దీనిపై కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తామని తెలిపారు.

జార్ఖండ్‌ రాష్ట్రం నుంచి వలస కూలీలు తమ స్వరాష్ట్రానికి వెళ్లిపోతామని చెప్పడంతో, కాంట్రాక్టర్ గుడ్డుకు చెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన గుడ్డు వారిపై దాడి చేశాడు.  ఈ ఘటనపై గౌతమ్ విశ్వకర్మ అనే ఓ కూలీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. మాకు పని ఆగిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేదు. కాంట్రక్టర్ న్ ను డబ్బుఅడిగితే ఇవ్వలేదు. దీంతో పిల్లా పాపలతో ఆకలితో పడుకుంటున్నాం.

కనీసం మా సొంత ఊర్లకు వెళితే ఎలాగోలా ఓ పూటైన తినొచ్చు అనే ఆశతో
మే 10న కాంట్రాక్టర్ గుడ్డును కలిసి, తాము తమ స్వరాష్ట్రానికి వెళ్ళిపోతామని చెప్పామనీ..దానికి అతను ఏమాత్రం ఒప్పుకోలేదు. మీరు వెళ్లటానికి వీల్లేదు..నా కాంట్రాక్టు అయ్యేంత వరకూ వెళ్లనిచ్చేది లేదని తెగేసి చెప్పాడు. కాదు..సార్ మా పరిస్థితి ఏమీ బాగాలేదు..మళ్లీ వస్తామని చెప్పినా అతను వినిపించుకోలేదు. తాము అక్కడే ఉండాలని, పని చేయాలని చెప్పాడని..తమకు రావలసిన బకాయిలను కూడా ఇవ్వలేదని వాపోయారు.

మాకు రావాల్సిన డబ్బులైనా ఇవ్వమని అడిగినందుకు ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడని వాపోయారు. తాము జార్ఖండ్‌లోని పాలము జిల్లాలోని బఖరి గ్రామం నుంచి వలస వచ్చామని..20 మంది కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నాం..దీంతో తమకు కరోనా వస్తుందేమోననే భయంతో సొంతఊరికి వెళ్లిపోతామనిఅడిగామనీ దీంతో ..కాంట్రాక్టర్ గుడ్డు తనపై దాడి చేశాడని, తన తలకు బలమైన గాయం అయిందని, రక్తస్రావం జరిగిందని, వైద్యులు కుట్లు వేశారని విశ్వకర్మ వాపోయాడు.

కాంట్రాక్టర్ దాడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుడ్డుని ప్రశ్నించగా..నేను ఎటువంటి దాడి చేయలేదని చెబుతున్నాడు. దీనిపై నీమ్రన పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఓం ప్రకాశ్ మాట్లాడుతూ గుడ్డును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి, విచారణ జరుపుతున్నామని తెలిపారు.