MLA Raja Singh : అమర్నాథ్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అమర్నాథ్ యాత్రలో ఉన్న ఆయన వరదల నుంచి కొద్దిలో తప్పించుకున్నారు.

MLA Raja Singh : అమర్నాథ్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Raja Singh

MLA Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అమర్నాథ్ యాత్రలో ఉన్న ఆయన వరదల నుంచి తృటిలో తప్పించుకున్నారు. వరద ముంచెత్తిన సమయంలో రాజాసింగ్ సమీపంలోనే ఉన్నట్లు తెలిసింది. వరద స్పాట్ నుంచి బయటకు వచ్చిన పది నిమిషాల్లోనే.. వరదలు వచ్చాయని రాజాసింగ్ తెలిపారు.

Amarnath cloudburst: పదికి చేరిన అమర్‌నాథ్‌ మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని

అమర్నాథ్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో కశ్మీర్ పోలీసులు రాజాసింగ్ ను అలర్ట్ చేశారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో చాపర్ లో వెళ్లేందుకు అనుమతించ లేదు. దీంతో రాజాసింగ్ చాపర్ ను రద్దు చేసుకున్నారు. మరోవైపు రాజాసింగ్ కు ట్రెత్ ఉండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పటిష్ట భద్రత నడుమ పోలీసులు రాజాసింగ్ ను శ్రీనగర్ కు తరలిస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అమర్ నాథ్ యాత్రపై వరుణుడు పంజా విసిరాడు. జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని అమర్ నాథ్ క్షేత్రం వద్ద భారీ వర్షం కురిసింది. దాంతో ఆలయ పరిసరాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా వరద నీరు పెరిగిపోవడంతో పలువురు భక్తులు అందులో చిక్కుకుపోయారు.

పక్కనే ఉన్న గుహ చుట్టు పక్కల 12వేల మంది వరకు భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో కొందరి ఆచూకీ తెలియరాలేదు. వేలమంది భక్తులు వరద ప్రభావానికి గురైనట్టు భావిస్తున్నారు. ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్టు గుర్తించారు. భారీ వర్షం, వరద నేపథ్యంలో సైనికులు, ఐటీబీపీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అమర్‌నాథ్‌ గుహ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. మేఘం బద్దలైనట్లుగా వాన పడింది. మంచుకొండల్లోంచి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో అమర్నాథ్ జల విలయంలో చిక్కుకుంది. అమర్నాథ్ యాత్ర భక్తుల కోసం వేసిన 25 టెంట్లు, 2 లంగర్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. పలు వాహనాలు సైతం వరద తాకిడిలో కొట్టుకుపోయాయి.