PM Modi : మంత్రివర్గంలో 33 మందిపై క్రిమినల్ కేసులు

బుధవారం కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన విషయం తెలిసిందే.. పాత వారు.. కొత్తగా ఎంపికైన మంత్రులు కలిసి 78 మంది ఉన్నారు. వీరిలో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. తీవ్రమైన హత్యానేరాలు ఉన్నవారు కూడా మంత్రి వర్గంలో ఉన్నారని తెలిపింది. ఎన్నికల సమయంలో వీరు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఈ కేసుల వివరాలు సేకరించింది ఏడీఆర్.

PM Modi : మంత్రివర్గంలో 33 మందిపై క్రిమినల్ కేసులు

Pm Modi

PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. 78 మంది ఉన్న మంత్రివర్గంలో 33 మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో తెలిపారని ఏడీఆర్ పేర్కొంది.

వీరిలో 24 మంది తమపై తీవ్రమైన నేరాలు ఉన్నట్లు వెల్లడించారని తెలిపింది ఏడీఆర్. కాగా జూన్ 7న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. మంత్రివర్గంలో మొత్తం 78 మంది మంత్రులు ఉండగా వీరితో గురువారం సమావేశమయ్యారు మోదీ. ఇక ఈ నెల 14 మరోసారి మంత్రివర్గ సమావేశం జరగనుంది.

మంత్రి పదవులు దక్కిన వారిలో అత్యంత సంపన్నుడు జ్యోతిరాదిత్య సింథియా.. తనకు రూ.379 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. ఇక రెండవ స్థానంలో పీయూష్ గోయల్ ఉన్నారు..తనకు రూ. 95 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. మూడు, నాలుగు స్థానాల్లో నారాయణ్ రాణే, రాజీవ్ చంద్రశేఖర్ ఉన్నారు. నారాయణ్ రాణే రూ.87 కోట్ల ఆస్తులు కలిగి ఉండగా, రాజీవ్ చంద్రశేఖర్ రూ.64 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.