‘కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రధాని మోడీనే ముందుగా తీసుకోవాలి’

‘కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రధాని మోడీనే ముందుగా తీసుకోవాలి’

Modi Covid-19 Vaccination: భారత ప్రధాని నరేంద్ర మోడీనే తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అంటున్నాడు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) లీడర్ తేజ్ ప్రతాప్ యాదవ్. ఇండియాలో శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పిన వ్యాక్సిన్ తొలి షాట్ ను ప్రధాని తీసుకుంటే తనతో పాటు అందరూ తీసుకుంటారని చెప్పుకొచ్చాడు. ప్రధాని నరేంద్ర మోడీ కొవిడ్-19 వ్యాక్సిన్ ఫస్ట్ షాట్ ను తీసుకోవాలి. అప్పుడు మేం కూడా తీసుకుంటాం అని ఈ బీహార్ నేత అంటున్నారు.

కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ, సమాజ్‌వాదీ అఖిలేశ్ యాదవ్ లు వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకడుగేస్తున్న క్రమంలో ఆర్జేడీ లీడర్ ఈ కామెంట్లు చేశారు. అంతకంటే ముందు మంగళవారం నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్-19 వ్యాక్సినేషన్స్ కు అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు.

బీహార్ లో అడ్మినిస్ట్రేషన్ కు అన్ని ఏర్పాట్లు చేశాం. కేంద్రం ఇచ్చిన సూచనల మేరకే ప్రియారిటీని చూసుకుని వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడతాం. 50ఏళ్లు అంతకంటే దాటిన వాళ్లు హెల్త్ కేర్, గవర్నమెంట్ వర్కర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు, షాప్ కీపర్లు, ట్రేడర్స్ లాంటి గ్రూపులకు ముందుగా వ్యాక్సిన్ ఇస్తామని ఆయన అన్నారు.

కాంగ్రెస్ లీడర్లు మనీశ్ తివారీ, శశిథరూర్, జైరామ్ రమేశ్ భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాక్సిన్ గురించి స్పందించారు. ఇటీవలే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం పొందడం పట్ల వారి భావన ఇలా ఉంది.

ఎటిమాలజిస్టులు, మెడికల్ ప్రాక్టీషనర్లు వ్యాక్సిన్ ఫేజ్ 3ట్రయల్స్ పూర్తవకుండానే ఆమోదం పొందటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఇండియన్లు కొవాక్సిన్ అడ్మినిష్ట్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తారో.. వారంతా థర్డ్ స్టేజ్ క్లినికల్ ట్రయల్ లో పాల్గొనాలని థరూర్ అంటున్నారు.