Modi- Yogi : యూపీలో చరిత్ర తిరగరాసిన బీజేపీ.. మోదీ-యోగీ డబుల్ ధమాకా

ఈ రాష్ట్రంలో గెలుపుద్వారా కేంద్రంలో మరోసారి బీజేపీనే అధికారంలోకి రానుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.

Modi- Yogi : యూపీలో చరిత్ర తిరగరాసిన బీజేపీ.. మోదీ-యోగీ డబుల్ ధమాకా

Up Modi Yogi Win

Modi- Yogi : అనుమానాలు, భిన్నాభిప్రాయాలు, ఆరోపణలు.. ఏవీ యూపీలో బీజేపీ జైత్రయాత్రను ఆపలేకపోయాయి. మోదీ-యోగీ ఛరిష్మాను దెబ్బతీయలేకపోయాయి. మోదీ ఆకర్షణ-యోగీ ప్రత్యేకత-అమిత్ షా వ్యూహాత్మకత.. కారణంగా యూపీలో బీజేపీ రికార్డ్ విక్టరీ కొట్టింది. కొత్త చరిత్రను తిరగరాసింది.

Read This : Punjab CM Charanjit Singh: రాజీనామాకు సిద్ధమైన పంజాబ్ సీఎం

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను మించి యూపీలో యోగీ విజయం సాధిస్తున్నారు. యూపీ ఎన్నికల ప్రాథమిక ఫలితాల్లోనే బీజేపీ ఆధిక్యత స్పష్టమైపోయింది. కౌంటింగ్ మొదలయిన కొన్ని గంటల్లోనే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది యోగీ నేతృత్వంలోని బీజేపీ. 1989 తర్వాత నాలుగుసార్లు 30శాతానికి పైగా ఓటింగ్ సాధించిన ఏకైక పార్టీగా చరితృ సృష్టించిన బీజేపీ…రాష్ట్రంపై మరోమారు తన ఆధిక్యత నిరూపించుకుంది. మోదీ, అమిత్ షా, యోగీ త్రయం రచించిన ఎన్నికల వ్యూహాల ముందు అన్ని పార్టీలు చిత్తయిపోయాయి.

పూర్వాంచల్, అవధ్ ప్రాంతాల్లోనూ బీజేపీ అభ్యర్ధులు దూసుకుపోతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ తూర్పు, బుందేల్ ఖండ్‌లోనూ బీజేపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. అక్కడే కాదు…అప్పటి బీజేపీ ఎంపీ స్వయంగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న ఉన్నావోలోనూ, దళిత యువతి హత్యాచారంతో రెండేళ్ల క్రితం అట్టుడికిన హథ్రాస్‌లోనూ, రైతులను కారుతో ఢీకొట్టించి హత్య చేసిన లఖింపూర్ ఖేరీలోనూ బీజేపీ అభ్యర్ధులే గెలుపు దిశలో ఉన్నారు. రౌడీ షీటర్ వికాస్ దూబే….పోలీసులపై దాడి చేసిన కాన్పూర్‌లోనూ బీజేపీనే ముందంజలో ఉంది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే…దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి..తీవ్ర చర్చనీయాంశంగా మారి…యోగీ ఆదిత్యనాథ్ పాలనపై విమర్శలు వ్యక్తమయ్యేలా చేసిన ఏ ఘటనలూ బీజేపీ ఓటు బ్యాంకును కదిలించలేకపోయాయి.

రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించడం, ఉత్తర్‌ప్రదేశ్ దేశ అత్యాచారాల రాజధానిగా మారిందన్న ఆరోపణలు, కోవిడ్ సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కోవడంలో వైఫల్యం చెందిందన్న విమర్శలు, గంగానది శవాలతో ఉప్పొంగడం, ఆక్సిజన్ అందక ఆస్పత్రుల్లో చిన్నారుల మరణ మృందంగం….అమాయక రైతుల పైకి కారు ఎక్కించిన దారుణాలు…ఎన్నికలకు కొన్ని నెలలు ముందు మంత్రులు రాజీనామా చేసి సమాజ్‌వాదీలో చేరడం, బీసీ ఓటు బ్యాంకును గణనీయంగా ప్రభావం చేయగలరని భావించిన స్వామి ప్రసాద్ మౌర్య పార్టీ వీడడం, 1989 తర్వాత వరుసగా ఏ పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదన్న సెంటిమెంట్.. గోరఖ్‌పూర్‌లో గెలిచి సీఎం అయిన చరిత్ర లేకపోవడం… ఇలా చెప్పుకుంటూ పోతే…యూపీలో ఇక బీజేపీ పనైపోయింది అని చెప్పడానికి చాలా అంశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఐతే.. అవన్నీ పటాపంచలైపోయాయి.

Read This : Punjab Election Results 2022: పంజాబ్ లో టాప్ లేపుతున్న ‘ఆప్’..స్థానిక పార్టీలను ఊడ్చిపారేస్తోంది

ముఖ్యమంత్రి యోగీ నాయకత్వ సామర్థ్యం, మిస్టర్ క్లీన్ ఇమేజ్, అమిత్ షా వ్యూహాలు, ప్రధాని మోదీ ప్రజాకర్షణ బీజేపీకి ఓట్ల వర్షం కురిపించాయి. స్థిరమైన ప్రభుత్వ హయాంలో…స్థిరంగా కొనసాగిన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు…యోగీ ప్రజాదరణను చెక్కుచెదరనీకుండా చేశాయి. ఇక బీజేపీ విజయానికి ప్రధానంగా దోహదపడివన అంశం హిందుత్వ అజెండా. వివాదాస్పద భూమి రామజన్మభూమికి దక్కడం, రామాలయ నిర్మాణం, వారణాసి రూపు రేఖలు మారిపోవడం, కాశీ కారిడార్ నిర్మాణం, ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వ్యూహాలు, ప్రతిపక్షం బలంగా లేకపోవడం, వ్యవసాయ చట్టాల రద్దు వంటివన్నీ యూపీని యోగీకి పెట్టని కోటగా మార్చేశాయి.

ఢిల్లీకి దగ్గరదారి ఉత్తర్‌ప్రదేశ్ అన్నది రాజకీయాల్లో ఓ నానుడి. అంతేకాదు….ప్రధానులను అందించే రాష్టంగా కూడా యూపీకి పేరుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీ..జాతీయ రాజకీయాలను శాసిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలను సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్స్‌గా భావించడానికి ప్రధాన కారణం యూపీనే. ఈ రాష్ట్రంలో గెలుపుద్వారా కేంద్రంలో మరోసారి బీజేపీనే అధికారంలోకి రానుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి.