PM Modi: రేపటి నుంచి మోదీ విదేశీ పర్యటన.. ఆసక్తిగా గమనిస్తున్న ఐరోపా సమాఖ్య..

సోమవారం నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటుసాగే ఈ పర్యటనలో పలు దేశాధినేతలతో మోదీ భేటీ అవుతారు. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య, దాని పరిణామాల...

PM Modi: రేపటి నుంచి మోదీ విదేశీ పర్యటన.. ఆసక్తిగా గమనిస్తున్న ఐరోపా సమాఖ్య..

Pm Modi

PM Modi: సోమవారం నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటుసాగే ఈ పర్యటనలో పలు దేశాధినేతలతో మోదీ భేటీ అవుతారు. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య, దాని పరిణామాల ప్రభావంపై ఆందోళనగా ఉన్న ఐరోపాలో ప్రధాని మోదీ పర్యటిస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే మోదీ పర్యటనపై ఐరాపో సమాఖ్య (ఈయూ) ఆసక్తిగా గమనిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే.

PM Modi : పెట్రోల్ ధరలు పెరుగుదల.. రాష్ట్ర ప్రభుత్వాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ లోని ప్రాంతాలను హస్తగతం చేసుకొనేందుకు రష్యా సైన్యం క్షిపణులతో బాంబుల వర్షం కురిపిస్తుంది. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో భారత్ వైఖరి పట్ల ఐరోపా దేశాలు అసంతృప్తిగా ఉన్న విషయం విధితమే. ఈ క్రమంలో ఐరోపా దేశాల్లో మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇటు భారత్ విదేశాంగ వర్గాలు సైతం ఐరోపా దేశాల్లో మోదీ పర్యటన కీలకమైందిగా భావిస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల భారత్ లో పర్యటించారు.  ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలకే ప్రాధాన్యతనిచ్చాయి. ఈ క్రమంలో మోదీ ఐరోపా దేశాల్లో పర్యటన సైతం ఈ కోవలోనే సాగుతుందని తెలుస్తోంది.

PM Modi : కోర్టుల్లో స్థానిక భాషల ఉపయోగంపై మోదీ కీలక వ్యాఖ్యలు

మోదీ విదేశీ పర్యటనలో భాగంగా తొలుత జర్మనీ చేరుకుంటారు. తర్వాత డెన్మార్క్.. అక్కడి నుండి మే4న తిరిగి భారత్ వచ్చే క్రమంలో పారిస్ లో కాసేపు ఆగనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక, బహుళ పక్ష సమావేశాల్లో మోదీ భేటీ కానున్నారు. 25 సమావేశాల్లో పాల్గోనున్న మోదీ 50మంది ప్రముఖ వాణిజ్య వేత్తలను కలవలనున్నారు. ప్రవాస భారతీయులతోనూ ప్రధాని మాట్లాడతారు. ఇదిలా ఉంటే భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్న జర్మనీ మోదీ పర్యటనకు అధిక ప్రాధాన్యతనిస్తోంది.