Veerappa Moily : కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చేరికను స్వాగతిస్తున్నా.. పార్టీకి మరింత బలం!

ఎన్నికల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరికపై ఆ పార్టీ నేతలు వ్యతిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మెయిలీ స్పందించారు.

Veerappa Moily : కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చేరికను స్వాగతిస్తున్నా.. పార్టీకి మరింత బలం!

Moily Bats For Prashant Kishor's Induction In Congress

Veerappa Moily : ఎన్నికల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరికపై ఆ పార్టీ నేతలు వ్యతిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మెయిలీ స్పందించారు. ప్రశాంత్ చేరికను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో సంస్క‌ర‌ణ‌లు తేవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్రశాంత్ రాక‌ను వ్య‌తిరేకించొద్ద‌ని పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌ను మొయిలీ కోరారు. ఎన్నిక‌ల రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ప్రశాంత్ నిరూపించుకున్నారని అన్నారు. వ్యూహకర్తగా ఉండే కంటే పార్టీలో చేరి పనిచేయడం కాంగ్రెస్ కు ప్రయోజనమేనని వీర‌ప్ప మొయిలీ చెప్పారు.

కాంగ్రెస్‌లో తలెత్తిన గ్రూప్ 23 వేదికను కొందరు సీనియర్ నేతలు దుర్వినియోగపర్చారని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం ఉందని, సమూల మార్పులు కావాలంటూ కొందరు సీనియర్లు నేతలు బహిరంగంగా లేఖ రాశారు. దాంతో G-23 లేఖాస్త్రంగా సంధించినట్టు అయింది. కొందరు నేతలు తమ స్వార్థం కోసం వాడకున్నారని ఆయన విమర్శించారు.
Afghanistan : ధైర్యం చేసి ఉద్యోగంలో చేరిన అఫ్ఘాన్ మహిళలు

సోనియా గాంధీ పార్టీలో నిర్మాణాత్మక ప్రక్రియ దిశలో మార్పులు చేస్తున్న క్రమంలో బహిరంగంగా ఇతరత్రా విమర్శలకు దిగడం సరైన పద్థతి కాదని ఆయన హితవు పలికారు. ఇలాంటి వైఖరితో ప్రత్యర్థి పార్టీకి మేలు చేసినట్లే అవుతుందని మెయిలీ అన్నారు. పార్టీ అధినేత్రి సోనియా తీసుకున్న నిర్ణయాల పట్ల తాను సంతోషిస్తున్నానని తెలిపారు. G23 పనికిరాని ముచ్చటే అయిందన్నారు.

రాజకీయాల్లో వ్యూహాలను రచించడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. ఆయన రాజకీయ వ్యూహం, ప్రణాళికలు కాంగ్రెస్ కు మరింత బలాన్ని చేకూరుస్తాయని అన్నారు. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా తాను వ్య‌వ‌హ‌రించ‌బోన‌ని ప్ర‌శాంత్ కిశోర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అనంతరం ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక‌ల‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నార‌ని ఊహాగానాలు వచ్చాయి. ప్రశాంత్ చేరిక విషయంలో తుది నిర్ణ‌యం మాత్రం సోనియాగాంధీదేన‌ని ఆ పార్టీ నేత‌లు అభిప్రాయపడుతున్నారు.
Drugs Case: నేడు ఈడీ విచారణకు నటుడు నవదీప్, ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌!