Moonlighting By Employees Is Cheating : ఐటీ కంపెనీలు చెప్తున్న ఈ ‘మూన్ లైటింగ్ ఏంటి’..? ఉద్యోగుల జీతాల కుదింపుకు అదే కారణమా?

జీతాల విషయంలో ఐటీ సంస్థలు వరుసగా షాక్‌లు ఇస్తున్నాయ్. అసలు ఉద్యోగుల జీతాల కుదింపు విషయంలో సంస్థలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలు ఏంటి... ఇకపై ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయా ?

Moonlighting By Employees Is Cheating : ఐటీ కంపెనీలు చెప్తున్న ఈ ‘మూన్ లైటింగ్ ఏంటి’..? ఉద్యోగుల జీతాల కుదింపుకు అదే కారణమా?

Moonlighting By Employees Is Cheating..Employee Variable Pay

Moonlighting By Employees Is Cheating : జీతాల విషయంలో ఐటీ సంస్థలు వరుసగా షాక్‌లు ఇస్తున్నాయ్. మరి దీంతో ఏం జరగబోతోంది. కరోనా సమయం నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ అంటూ అలవాటు పడిన వారికి.. హనీమూన్‌లాంటి పీరియడ్ ముగిసినట్లేనా ? అసలు ఉద్యోగుల జీతాల విషయంలో సంస్థలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలు ఏంటి… ఇకపై ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయా ?

కరోనాతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అయింది. మొదట్లో ఇబ్బంది పడిన ఉద్యోగులు.. ఆ తర్వాత దాన్నే అదనుగా చేసుకున్నారు. ఓ ఉద్యోగం చేస్తూనే.. ఉపాధి కోసం మరో ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. ఉద్యోగులు, నిపుణులు.. ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడమే మూన్ లైటింగ్‌. ఇదే ఇలాంటి పరిణామాలతో టెన్షన్‌ పడుతున్న కంపెనీలు.. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నాయ్. కొన్ని అయ్యాయ్ కూడా ! ఇలా ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం.. తమ కంపెనీలను మోసం చేస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని ఆ సంస్థలు అంటున్నాయ్.

మూన్‌లైటింగ్… అంటే ఒకటికి మించి ఉద్యోగాలు చేయడం అనేది మోసంతో సమానం అని విప్రో చైర్మన్‌ అజీమ్ ప్రేమ్‌జీ లాంటి వాళ్లు కూడా ట్వీట్ చేశారు. విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కూడా అదే అన్నారు. రెండు ఉద్యోగాలు చేయడం వల్ల ఉత్పాదకత తగ్గుతుందని, ఇదే సమయంలో ఇటువంటి ఉద్యోగుల ద్వారా తమ కంపెనీకి సంబంధించిన డాటా ఇతర ప్రత్యర్థి కంపెనీలకు తెలిసే అవకాశం ఉంటుందన్నది వారి భయం. రెండు ఉద్యోగాల వల్ల జీతం పెరగొచ్చు.. అదే సమయంలో సమస్యలు కూడా పెరుగుతాయ్. ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎలా ఉన్నా.. మూన్‌లైటింగ్ అనేది లిమిటెడ్ టైమ్‌ అవకాశం. ఐటీలో ప్రస్తుతం ఉన్న బూమ్ తగ్గిన తర్వాత.. ఈ అవకాశాలు నిలిచిపోతాయ్.

ఇలాంటి సమస్యకు చెక్‌ పెట్టాలనే.. ఇప్పుడు వర్క్ ఫ్రం హోం నుంచి పనికి తిరిగి రావాలంటూ ఉద్యోగులకు కంపెనీలు మెసేజ్‌లు పంపుతున్నాయ్. రెండేళ్లుగా ఒకే సమయం.. రెండు ఉద్యోగాలు అన్నట్లు ఎంప్లాయిస్ చేస్తున్న పనులకు ఇప్పుడు చెక్‌ పడినట్లే ! నిజానికి మూన్‌లైటింగ్, డ్యూయల్‌ ఎంప్లాయిమెంట్‌ విధానం వెస్టర్న్ కంట్రీస్‌లో ఎక్కువగా ఉంది. ఐతే ఇది ఇక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. అందుకే కష్టం అయినా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సంస్థలు సిద్ధం అవుతున్నాయ్. నికర లాభాలు తగ్గాయని చూపించి.. జీతాల పెంపు తగ్గించడం, వేరియబుల్ పే ఆలస్యం చేయడం వెనక స్ట్రాటజీ ఉందన్న చర్చ కూడా జరుగుతోంది..

మార్జిన్ ఒత్తిళ్ల కారణంగానే ఇలాంటి నిర్ణయాలు అని చెప్తున్న సంస్థలు.. కొత్తగా నియామకాలను భారీగా పెంచుతున్నాయ్. ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్లకు బదులు.. కొత్త టాలెంట్‌తో టీమ్‌ను బలంగా మార్చుకొని.. రిజల్ట్ రాబట్టాలన్న ప్లాన్‌తో కనిపిస్తున్నాయ్. ఏమైనా సాఫ్ట్‌వేర్ అంటే వేలకు వేల ఇంక్రిమెంట్లు, అద్భుతమైన జీతాలు అనే మాటలు ఇక వినిపించకపోవచ్చు. కరోనాతో ప్రపంచ గతే మారిపోయింది. ఆర్థికంగా ఎన్నో మార్పులు చూడాల్సి వచ్చింది. దీంతో ఉద్యోగుల తీరులోనే కాదు.. సంస్థల వ్యవహార శైలిలోనూ మార్పు కనిపిస్తోంది. ఈ ఇయర్ అంతా ఇలానే ఉంటుందన్నా.. ఈ ఇయర్‌ అనేది స్టార్టింగ్ మాత్రమే అన్న చర్చ కూడా ఐటీ సర్కిల్స్‌లో నడుస్తోంది.