Sanjay Raut : ఇక మోదీ హవా ముగిసింది.. ఇప్పుడు విపక్షాల వేవ్ వస్తోంది : ఎంపీ సంజయ్ రౌత్

కర్ణాటక ప్రశాంతంగా, సంతోషంగా ఉందని అల్లర్లు ఎక్కడని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు విపక్షాల సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

Sanjay Raut : ఇక మోదీ హవా ముగిసింది.. ఇప్పుడు విపక్షాల వేవ్ వస్తోంది : ఎంపీ సంజయ్ రౌత్

Sanjay Raut

Shiv Sena MP Sanjay Raut : దేశవ్యాప్తంగా ఇప్పుడు విపక్షాల వేవ్ వస్తోందని.. ఇక మోదీ హవా ముగిసిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కర్ణాటక నియంతృత్వాన్ని ఓడించగలదని ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిచింది అంటే.. బజరంగ్ బలి కాంగ్రెస్ తో ఉన్నారని బీజేపీతో కాదని అన్నారు. బీజేపీ ఓడిపోతే అల్లర్లు వస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు అని గుర్తు చేశారు.

కానీ, కర్ణాటక ప్రశాంతంగా, సంతోషంగా ఉందని అల్లర్లు ఎక్కడని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు విపక్షాల సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆదివారం శరద్ పవార్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో 2024 ఎన్నికల గురించి చర్చించి దాని కోసం సన్నాహాలు ప్రారంభిస్తామని చెప్పారు.

GVL Narasimha Rao : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నస్థాయిలో సీట్లు రాలేదు : ఎంపీ జీవీఎల్ నరసింహారావు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, బీజేపీ ఓటమిపాలైంది. కర్ణాటక రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 136 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 65 సీట్లకు పరిమితం అయింది. జేడీఎస్ 19 సీట్లను గెలుచుకుంది. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ ఒక సీటు దక్కించుకుంది. సర్వోదయ కర్ణాటక పార్టీకి ఒక సీటు లభించింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు 113 మేజిక్ ఫిగర్ కాగా, కాంగ్రెస్ కు అంతకంటే 23 సీట్లు ఎక్కువగానే వచ్చాయి. 2018లో కాంగ్రెస్ కి 80 సీట్లు మాత్రమే వచ్చాయి. ముఖ్యమంత్రి పదవికి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌ థావర్ చంద్ గెహ్లాట్ కు అందజేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.