GVL Narasimha Rao : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నస్థాయిలో సీట్లు రాలేదు : ఎంపీ జీవీఎల్ నరసింహారావు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపవన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుచుకుందని తెలిపారు.

GVL Narasimha Rao : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నస్థాయిలో సీట్లు రాలేదు : ఎంపీ జీవీఎల్ నరసింహారావు

GVL Narasimha Rao

Karnataka Assembly Elections-2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, బీజేపీ ఓటమిపాలైంది. ఎన్నికల ఫలితాలపై బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదన్నారు. ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని చెప్పారు. అయితే, సీట్ల సంఖ్య తగ్గినా ఓట్ల శాతం తగ్గలేదని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆదివారం విశాఖలో జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపవన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుచుకుందని తెలిపారు. ఒక రాష్ట్రంలో ఫలితాలు మరొక రాష్ట్రంపై ప్రభావం చూపింవని స్పష్టం చేశారు. మళ్లీ మోదీనే ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.

Karnataka Congress CM: సిద్ధరామయ్య, శివకుమార్‌లలో సీఎం ఎవరు..? అదిరిపోయే ప్లాన్‌లో కాంగ్రెస్.. బెంగళూరుకు రేవంత్ రెడ్డి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయడంకా మోగించింది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 136 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 65 సీట్లకు పరిమితం అయింది. జేడీఎస్ 19 సీట్లను గెలుచుకుంది. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ ఒక సీటు దక్కించుకుంది. సర్వోదయ కర్ణాటక పార్టీకి ఒక సీటు లభించింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

అయితే, 113 మేజిక్ ఫిగర్ కాగా, కాంగ్రెస్ కు అంతకంటే 23 సీట్లు ఎక్కువగానే వచ్చాయి. 2018లో కాంగ్రెస్ కి 80 సీట్లు మాత్రమే వచ్చాయి. ముఖ్యమంత్రి పదవికి బసవరాజ్ బొమ్మై రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌ థావర్ చంద్ గెహ్లాట్ కు అందజేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.