షాకింగ్ న్యూస్ : సామాన్యుడి ఇంటికి రూ.80 లక్షల కోట్లు బిల్లు!!

  • Published By: nagamani ,Published On : June 8, 2020 / 10:46 AM IST
షాకింగ్ న్యూస్ : సామాన్యుడి ఇంటికి రూ.80 లక్షల కోట్లు బిల్లు!!

మధ్యప్రదేశ్‌లో ఓ సామాన్యుడి ఇంటికి వేలు కాదు లక్షలు కూడా కాదు ఏకంగా రూ.80 లక్షల కోట్లు బిల్లు వచ్చింది. దీన్ని చూసిన సదరు వ్యక్తి కళ్లు తిరిగిపడిపోవటం ఒక్కటే తక్కువైంది. కంగారు పడిపోయాడు. ఈ కరెంట్  బిల్ ఏంటీ? నా ఇల్లేంటి? నా వాడకం ఏంటి అంటూ తెగ ఆశ్చర్యపడిపోతు షాక్ అయ్యాడు. మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లాలోని బైఢన్ గ్రామంలోని ఓ సామాన్యుడి ఇంటికి ఏకంగా ఎవ్వరూ ఊహించన విధంగా రూ.80 లక్షల కోట్లు బిల్లు వచ్చింది. 

కరోనా కాలంలో వైరస్ కంటే  కరెంట్ బిల్లులకే ప్రజలు భయపడిపోతున్నారు. కరెంట్ బిల్లుకు షాక్ కొడుతున్నట్లుగా ఉంది నేటి కరెంట్ బిల్లులు వచ్చిన తీరు చూస్తే. లాక్ డౌన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న సమయంలో విద్యుత్‌ బిల్లులు మోత మోగిస్తున్నాయి. ప్రస్తుతం మీటరు రీడింగ్‌ ప్రకారం బిల్లులు ఇవ్వడంతో రెట్టింపు చార్జీలు వస్తున్నాయి. డబుల్ కాదు త్రిబుల్ కూడా కాదు అంతకు మించి అన్నట్లుగా వస్తున్నాయి. 

రెండు నెలల రీడింగ్‌ ఒకేసారి తీయడంతో ఏ,బి,సి  స్లాబ్‌ మారి చార్జీలు భారీగా  పెరిగాయి. దీంతో వినియోగదారులు భయాఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సదరు బాధిత వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధితుడు వాపోయాడు. అధికారుల తప్పిదంతోనే ఇలా జరిగినా వాళ్లు ఏమాత్రం పట్టించుకోవటంలేదని వాపోయాడు. అయినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎంతగా బ్రతిమిలాడినా అధికారులెవ్వరూ పట్టించుకోవట్లేదని..ఇప్పుడు నేనేం చేసేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

Read:జూన్-10నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం