Opposition 3-Minute Video : మిస్టర్ మోడీ..మా మాట వినండి, 3 నిమిషాల వీడియో

మిస్టర్ మోడీ..మా మాట వినండి...అంటూ TMC మూడు నిమిషాల వీడియోను విడుదల చేసింది. పార్లమెంట్ సమావేశాలు కొద్దిరోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేశారు. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ ఒబ్రయెన్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను పోస్టు చేశారు.

Opposition 3-Minute Video : మిస్టర్ మోడీ..మా మాట వినండి, 3 నిమిషాల వీడియో

Modi

Mr Modi Come Listen’: మిస్టర్ మోడీ..మా మాట వినండి…అంటూ TMC మూడు నిమిషాల వీడియోను విడుదల చేసింది. పార్లమెంట్ సమావేశాలు కొద్దిరోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ వీడియోను విడుదల చేశారు. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ ఒబ్రయెన్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను పోస్టు చేశారు. ఇందులో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విపక్ష సభ్యులు మాట్లాడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెగాసస్, స్పైవేర్, వ్యవసాయ చట్టాలపై గత కొద్దిరోజులుగా పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలకు హాజరు కావాలని..ప్రతిపక్ష నాయకుల డిమాండ్లను వినాలని టీఎంసీ నాయకులు ప్రధాన మంత్రిని కోరారు. గత 14 రోజులుగా తాము డిమాండ్ చేస్తున్న అంశాలపై చర్చకు అనుమతించడం లేదని, ధైర్యం..ఉంటే ఇప్పుడే చర్చలు ప్రారంభించాలని కాంగ్రెస్ సభ్యులు మల్లిఖార్జున్ ఖర్గే చెప్పడం ఆ వీడియోలో వినిపిస్తోంది. ప్రతిపక్షాలకు చెందిన పలు పార్టీల సభ్యులు అంశాలపై మాట్లాడిన మాటలు అందులో ఉన్నాయి.

పార్లమెంట్ లో వాక్ స్వాతంత్ర్యం ఉంటుందని టీఎంసీ ఎంపీ సుఖేందు వెల్లడించారు. ప్రభుత్వం అనవసరంగా ప్రజలను మోసగిస్తోందని, పెగాసస్ వంటి కంపెనీలను తీసుకొస్తోందంటూ…నేషనల్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ వందన చవాన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్ ప్రతొక్కరి ఇంటికి చేరుకుందని..దీనిపై చర్చించాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆర్జేడీ సభ్యుడు. చివరిలో మిస్టర్ మోడీ..మాటలను వినండి అంటూ ఉంది.

జులై 19వ తేదీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రారంభ ప్రసంగాల కోసం, కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రులను పరిచయడం చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకసారి పార్లమెంట్ కు హాజరయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. పెగాసస్, వ్యవసాయ చట్టాలు, ఇతరత్రా కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అటు లోక్ సభ, ఇటు రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ స్తంభిస్తోంది.

ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ఇతర కీలక వ్యక్తులకు సంబంధించిన ఫోన్లను హ్యాక్ చేసిన అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో మంగళవారం పార్లమెంట్ లో ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకపడ్డారు ప్రధాని మోదీ. పేపర్లు చింపడం, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం..రాజ్యాంగాన్ని అవమానపరిచారని తెలిపారు. మరి ప్రస్తుతం విడుదల చేసిన వీడియోపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.