బార్లు, క్లబ్బులు 24×7 గంటలు తెరిచే ఉంటాయి 

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 06:13 AM IST
బార్లు, క్లబ్బులు 24×7 గంటలు తెరిచే ఉంటాయి 

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 26 నుంచి ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్, పబ్‌లను 24×7 గంటలూ తెరిచే ఉంచాలని పర్యాటక మంత్రి ఆదిత్య ఠాక్రే నిర్ణయించారు. అయితే ఇది కేవలం ప్రయోగాత్మకంగానే అమలు చేస్తామని, ఒకవేళ సక్సెస్ అయితే మరిన్ని ప్రాంతాల్లో అమలు చేస్తామని ప్రకటించారు. ముంబై మున్సిపల్ కమిషన్ తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదిత్య ఠాక్రే తెలిపారు. ముంబైలోని గేటెడ్ కమ్యూనిటీలలో 24×7 మాల్స్ తెరిచే ఉంటాయని తెలిపారు. 

ప్రస్తుతానికి మాత్రం ఫోర్ట్‌తో పాటు కాలా ఘోడా, సౌత్ ముంబైతో పాటు బండ్రా కుర్లా ప్రాంతాల్లో ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు.  పరిపాలనాపరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలపై బలవంతంగా రుద్దేలా ఉండకూడదని ఆదిత్యా అన్నారు. ఈ నిర్ణయంపై ఆయా సంస్థల యాజమానులు తమ క్లబ్బులు, పబ్బులను, షాపులను తెరవాలా వద్దా అనేది వారే నిర్ణయించుకుంటారని తెలిపారు.అది వారి వారి ఇష్టమనీ అన్నారు.