ఫోన్ దొంగ అనుకున్నారు.. తర్వాత కొత్త ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన పోలీసులు

ఫోన్ దొంగ అనుకున్నారు.. తర్వాత కొత్త ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన పోలీసులు

Mumbai Police: ఓ మహిళ తన ఎనిమిదేళ్ల కొడుకు కోసం సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ తంటాలు తెచ్చిపెట్టింది. బొరివిలిలో ఉండే స్వాతి సుభాష్ సారె అనే
మహిళ రూ.6వేలకు ఫోన్ కొనింది. దానికి రిపైర్ల కోసం మరో రూ.1500ఖర్చు పెట్టింది. పనిచేస్తుందనే సంతోషంలో సిమ్ కార్డు వేసి వాడటం మొదలుపెట్టింది.

రెండో రోజే రైల్వే పోలీసులు ఇంటికొచ్చారు. ఈ ఫోన్ ను ఎక్కడ దొంగిలించావ్ అంటూ లాక్కొని ఆమెను స్టేషన్ కు తీసుకెళ్లారు. మూడు నెలల పాటు కష్టపడి పనిచేసుకున్న డబ్బును కొడుకు చదువు ఆగిపోకూడదని ఖర్చుపెట్టి ఫోన్ కొంది. ఆ ఫోన్ ను సీజ్ చేసిన పోలీస్ అధికారులు ఎక్కడ దొంగిలించావంటూ రోజంతా ప్రశ్నించారు.



ఆ తర్వాత ఆమె చెప్పిన మాటలు నిజమేనని నమ్మి వదిలేశారు. ఇంటికి వచ్చిన సారె.. పనిచేస్తున్న యజమానికి మొరపెట్టుకుంది. ఆయన నేరుగా ముంబై పోలీసులకు ఘటన గురించి సవివరంగా ట్వీట్ చేశారు. ముంబై కమిషనర్ పరమ్ వీర్ సింగ్ దీనికి ఒప్పుకుని హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు.

సారెకు సహాయం చేయాలని మా టీం అనుకుంది. ప్రొఫెసర్ ధీరేంద్ర మెహతా కొత్త ఫోన్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్పాడు. సారెను పిలిపించి గిఫ్ట్ అందజేశారు.

ఇన్వెస్టిగేషన్ లో మహిళ అబద్ధం చెప్పినందుకే అనుమానించాల్సి వచ్చింది. ముందుగా ఆ ఫోన్ రిక్షాలో దొరికిందని చెప్పింది. ఆ తర్వాత ఆమె వేరొకరి దగ్గర కొనుగోలు చేసినట్లు ఒప్పుకుంది. ఈ వాంగ్మూలంతో ఆమెపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశాం కానీ, అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఫోన్ కొన్నట్లు కానీ, దొంగిలించనట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు. దీనిపై ఆమె కోర్టులో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది’ అని పోలీస్ అధికారులు అన్నారు.

రైల్వే పోలీసులు చెప్పిన దానిని బట్టి.. ‘దొంగిలించిన ఫోన్ అని.. కోర్టుకు రావాలని సూచించారు. కోర్టుకు వెళ్లి అదే విషయం చెప్తా. నా యజమానికి కూడా అదే చెప్పా’ అని బాధిత మహిళ చెప్పింది.