Covid-19 : మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా మరణాలు..భారీగా కేసులు

మహారాష్ట్రపై కోవిడ్ పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా మహారాష్ట్రలోనే కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కోవిడ్ మరణాలు కూడా క్రమంగా

Covid-19 : మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా మరణాలు..భారీగా కేసులు

Mumbai

Covid-19 : మహారాష్ట్రపై కోవిడ్ పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా మహారాష్ట్రలోనే కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కోవిడ్ మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

ఆదివారం మహారాష్ట్రలో 44,388 కోవిడ్ కేసులు,12 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 2,02,259గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 1,41,639గా ఉంది. ఇక,రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1216గా ఉంది.

అయితే రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో దాదాపు సగం కేసులు ఒక్క ముంబైలోనే నమోదవుతున్నాయి. ఇవాళ మాత్రమే కాకుండా గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.

గడిచిన 24 గంటల్లో దేశ ఆర్థిక రాజధానిలో 19,474 కోవిడ్ కేసులు,ఏడు మరణాలు నమోదయ్యాయి. కాగా, శనివారంతో పోల్చితే 4శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే ఇవాళ ముంబైలో నమోదైన కేసుల్లో 82శాతం(15,969) అసింప్టమాటిక్(రోగ లక్షణాలు లేని)అని అధికారులు తెలిపారు.

ముంబైలో ఇవాళ 1240మంది కోవిడ్ పేషెంట్లు హాస్పిటల్స్ లో చేరారని,ఇందులో 118మందికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైందని తెలిపారు. ముంబైలో ప్రస్తుతం 111,437 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. సిటీలోని మొత్తం 34,960 హాస్పిటల్ బెడ్స్ లో… 21.3శాతం(7,432) బెడ్స్ పై పేషెంట్లు ఉన్నట్లు తెలిపారు.

ALSO READ Oxygen Support : 24 గంటల్లో 264% పెరిగిన ఆక్సిజన్ వినియోగించే కరోనా పేషంట్ల సంఖ్య