Kuno National Park: కునో పార్కులో నమీబియా చిరుత మృతి.. మిగిలిన వాటి పరిస్థితి ఎలా ఉదంటే?
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని కునో పార్కు (Kuno National Park) లో నమీబియా (Namibia) నుంచి గతేడాది తీసుకొచ్చిన సాషా (Sasha) అనే చిరుత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరణించింది.

Kuno National Park
Kuno National Park: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని కునో పార్కు (Kuno National Park) లో నమీబియా (Namibia) నుంచి గతేడాది తీసుకొచ్చిన సాషా (Sasha) అనే చిరుత మరణించింది. అది కొంతకాలంగా కిడ్నీ వ్యాధి (Kidney disease) తో బాధపడుతుంది. ఈ చిరుత భారతదేశంకు తీసుకురాకముందే అనారోగ్యంతో బాధపడుతోంది. జనవరి 23న సాషా అలసట, బలహీనంగా ఉన్నట్లు గుర్తించిన కునో పార్కు సిబ్బంది.. ఎన్‌క్లోజర్‌లో ఉంచి చికిత్స అందించారు. అయితే, తీవ్ర అనారోగ్యంతో సోమవారం చిరుత మరణించినట్లు కునో నేషనల్ పార్క్ అధికారులు తెలిపారు.
1950 తరువాత భారతదేశంలో చీతాలు కనుమరుగయ్యాయి. దీంతో దేశంలో మళ్లీ చీతాల పునరుద్దరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక ప్రాజెక్ట్ ద్వారా గతేడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి చిరుతలను భారత దేశంకు తరలించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో పార్కులోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో వీటిని ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఇందులో మూడు మగ, ఐదు ఆడ చిరుతలు ఉన్నాయి. కొన్ని నెలలు పార్కులోని ఎన్ క్లోజర్ లో వీటిని ఉంచి పర్యవేక్షించారు. భారత వాతావరణంకు అలవాటు పడిన తరువాత వీటిని అడవిలోకి వదిలేశారు.
నమీబియా నుంచి వచ్చిన చిరుతల పర్యవేక్షణకోసం కునో పార్కు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, సాషా అనే చిరుత భారత్ వచ్చే సమయానికి అనారోగ్యంగా ఉండటం, ప్రస్తుతం ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరణించినట్లు పార్కు అధికారులు తెలిపారు. కునో పార్కులో ఉంచిన మిగిలిన చిరుతలు ఆరోగ్యంగా ఉన్నట్లు పార్కు అధికారులు పేర్కొన్నారు.