Sameer Wankhede : ఎవరీ సమీర్‌ వాంఖడే?.. ఆయనపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?

నిన్నటి దాకా డ్రగ్స్ కేసులో సూపర్ హీరోగా క్రేజ్ సంపాదించిన ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఇప్పుడు సొంత సంస్థే దర్యాప్తుకు సిద్ధమైంది. అసలు ఇంతకీ ఎవరీ సమీర్‌ వాంఖడే..?

Sameer Wankhede : ఎవరీ సమీర్‌ వాంఖడే?.. ఆయనపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?

Sameer

NCB official Sameer Wankhede : నిన్నటి దాకా డ్రగ్స్ కేసులో సూపర్ హీరోగా క్రేజ్ సంపాదించిన ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఇప్పుడు సొంత సంస్థే దర్యాప్తుకు సిద్ధమైంది.. అసలు ఏం జరుగుతుందో? ఎందుకు జరుగుతుందో? అందరికి తెలుసు.. కొన్ని పార్టీల నేతలు నన్నే ఎందుకు టార్గెట్‌ చేశారో.. ఇప్పుడు ఈ అంశంలోకి అనవసరంగా నా కుటుంబాన్ని కూడా ఎందుకు లాగుతున్నారో తెలుసంటూ ఆవేదన వ్యక్తం చేశారు సమీర్‌ వాంఖడే.. అసలు ఇంతకీ ఎవరీ సమీర్‌ వాంఖడే.. ఒక్కసారిగా ఆయనపై ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?

ముంబై క్రూయిజ్‌ షిప్‌లో డ్రగ్స్‌ పట్టుపడినప్పటి నుంచి బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది.. ఇప్పుడా ప్లేస్‌ను రీప్లేస్‌ చేస్తోంది సమీర్‌ వాంఖడే పేరు.. ఆర్యన్‌ కేసును లీడ్‌ చేస్తున్న సమీర్‌ వాంఖడేపై ఇప్పుడు ఆరోపణల వర్షం కురుస్తోంది..

Coiveshield Vaccine : బహిరంగ మార్కెట్లో కోవిషీల్డ్ అమ్మకాల కోసం సీరం దరఖాస్తు

ప్రస్తుతం ఈ డ్రగ్స్‌ వ్యవహారంలో సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ అనే వ్యక్తి ఎన్‌సీబీపైనే సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న గోసవీ, ఎన్సీబీ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఎన్సీబీ ఉన్నతాధికారి 25 కోట్ల లంచం డిమాండ్ చేశారని తెలిపాడు.. అంతేకాకుండా ఈ డ్రగ్స్‌ కేసులో ఎన్‌సీబీ తనతో బ్లాంక్‌ పంచనామాపై బలవంతంగా సంతకం చేయించుకుందని ఆరోపించాడు. దీనికి తోడు సమీర్‌ వల్ల తనకు ప్రాణహాని ఉందన్నాడు.

ఇప్పుడీ ఆరోపణలు సమీర్‌ మెడకే చుట్టుకున్నాయి.. దీంతో ఎన్సీబీ సమీర్‌ వాంఖడేపై విజిలెన్స్‌ ఎంక్వైరీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.. ఆర్యన్‌ ఖాన్‌ ఇతరులను విడచి పెట్టడానికి 25 కోట్ల లంచం వ్యవహారం, సమీర్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలేంటో తేల్చాలని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్ జ్ఞానేశ్వర్‌ సింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది.. దీంతో ఈ కేసు కొత్త టర్న్ తీసుకుంది..

NTR: ప్రాణాపాయం నుండి కోలుకున్న తారక్ అభిమాని.. వీడియో కాల్ వైరల్!

ఇప్పటికే తనను టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్న ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన సమీర్‌.. ఈ అంశంపై కూడా స్పందించారు.. తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని.. కానీ ఎవరు చేయిస్తున్నారో? ఎందుకు చేయిస్తున్నారో? నా కంటే వారికే బాగా తెలుసంటూ ఇన్‌ డైరెక్ట్‌గా ఎన్సీపీ నేత మాలిక్‌పై మరోసారి సెటైర్లు వేశారు.. ఓ రాజకీయ నేతకు దగ్గరి బంధువైన సమీర్‌ ఖాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినప్పటి నుంచి ఈ వ్యక్తిగత దాడి జరుగుతోందని సమీర్‌ వాంఖడే ఆరోపించారు.

అయితే ఇందులో తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయడం బాధాకరమైన విషయమన్నారు సమీర్.. తన చనిపోయిన తల్లిని, తండ్రిని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని.. వారి ఫోటోలను కూడా సర్క్యూలేట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. తనపై వచ్చిన ఎలాంటి ఆరోపణలకైనా దర్యాప్తుకైనా సిద్ధమని.. కానీ ఈ కేసులో చాలా మంది హైప్రొఫైల్ వ్యక్తుల ఇన్వాల్ మెంట్ ఉందని.. కాబట్టి కోర్టు సరైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నానని సమీర్‌ అన్నారు.

Facebook ఆన్‌లైన్ ద్వేషాన్ని ప్రోత్సహిస్తుందా? మాజీ ఉద్యోగి వ్యాఖ్యలతో ఇబ్బందే!

అసలు సమీర్‌ ఇంతలా టార్గెట్‌ ఎందుకు అవుతున్నారు? సమీర్‌ చెప్పిందే నిజమైతే తనను టార్గెట్‌ చేయడానికి ఒక్క ఆర్యన్‌ ఖాన్‌ కేసే కారణమా? అంటే లేదనే తెలుస్తోంది. 2008 ఇండియన్‌ రెవెన్యూ బ్యాచ్‌ కు చెందిన సమీర్ వాంఖడే.. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థలలో పనిచేశారు.. పని చేసిన ప్రతి చోటా మెడల్స్‌ తన ఖాతాలో వేసుకున్నారు.. 2008లో ఎయిర్ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లో ఫస్ట్‌ పోస్టింగ్‌ తీసుకున్న సమీర్‌.. ముంబై ఎయిర్‌ పోర్ట్‌ లో కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసినప్పుడు కస్టమ్స్‌ డ్యూటీ ఎగ్గొట్టే సెలబ్రెటీల పాలిట సింహస్వప్నంగా మారారు.. 2010లో మహారాష్ట్ర టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన సమీర్. ఆ ఏడాది 2 వేల 500 టాక్స్‌ ఎగవేత దారులపై కేసులు నమోదు చేశారు.. ఇందులో 200 మందికి పైగా సెలబ్రెటీలే ఉన్నారు.. ఆ ఏడాది ముంబైలో అదనంగా 87 కోట్ల పన్నులు వసూలు అయ్యింది..

తను ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వర్తించే సమయంలో జరిగిన 2011 క్రికెట్‌ వరల్డ్ కప్‌ ట్రోఫీకి సైతం కస్టమ్‌ డ్యూటీ వేశారు సమీర్‌.. బాలీవుడ్ సెలబ్రెటీల ఇళ్లల్లో అనేక రైడ్లు చేశారు.. ఇందులో అనురాగ్‌ కశ్యప్‌, వివేక్‌ ఒబేరాయ్, రామ్‌ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. 2014-16 మధ్య డిప్యూటేషన్‌పై ఎన్‌ఐఏలో పనిచేసిన సమీర్‌.. ఆ సమయంలో ఎన్నో హై ప్రొఫైల్‌ టెర్రరిస్ట్‌ కేసులను హ్యాండిల్ చేసి ఎక్సలెన్స్‌ ఇన్‌ సర్వీస్‌ మెడల్ కూడా అందుకున్నారు.. ఆ తర్వాత 2017-20 మధ్య డీఆర్‌ఐ జాయింట్‌ డైరెక్టరేట్‌గా బదిలీ అయ్యారు.. ఆ సమయంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 180 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ గుర్తించి.. సమీర్‌ ఓ రికార్డ్‌నే సృష్టించారు.

Coronavirus Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం.. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా..

సుశాంత్‌ సింగ్ సూసైడ్ కేసులో కూడా సమీర్‌ వాంఖడేను ఏరికొరి మరి పిలిపించుకోని దర్యాప్తు బాధ్యతలను అప్పగించింది ఎన్సీబీ.. అప్పటి నుంచే ఈ కేసు దర్యాప్తులో వేగం పెరిగింది.. సమీర్‌ కేసు టేకప్ చేశాక 33 మందిని అరెస్ట్‌ చేశారు.. వారందరిపై ఛార్జ్‌ షీట్‌ నమోదు చేశారు.. ఎన్‌సీబీలో తన పదవీ కాలం ముగుస్తుందనగా క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్ రాకెట్‌ ను బయట పెట్టారు సమీర్‌… దీంతో ఆయన పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించింది ఎన్సీబీ..

తన ట్రాక్ రికార్డ్‌లో ఎన్నో కేసులు, ఎంతో మంది సెలబ్రెటీలతో ముక్కు పిండి టాక్స్‌ వసూలు చేసిన సమీర్‌పై ఇప్పుడు డైరెక్ట్‌ అటాక్ మొదలైంది.. ఎన్నో కేసుల్లో నిందితులతో ముందుగానే వాంగ్మూలాలను ఇప్పించేవారని.. దీనికి తన సోదరి క్రిమినల్‌ లాయర్‌ యాస్మిన్‌కు కూడా లింక్‌ ఉందన్న ఆరోపణలు రావడంతో.. సమీర్‌ మొదటి సారి మీడియా ముందు నోరు విప్పుతున్నారు.. తనను టార్గెట్ చేసేవారేవరో.. ఎందుకు టార్గెట్ చేస్తున్నారో.. తెలుసంటూ.. ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు… ఇప్పుడు ఈ విజిలెన్స్‌ ఎంక్వైరీతో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఏ మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.